నాగిని డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన మాజీ స్టార్ క్రికెట‌ర్‌..

-

ఓవల్‌ టెస్ట్‌లో భార‌త క్రికెట్ టీం చారిత్రక విజయాన్నినమోదు చేసిన క్ర‌మంలో ఆటగాళ్లు, అభిమానులే కాక మాజీ క్రికెటర్లు సైతం సంబురాల్లో మునుగున్నారు. 50 సంవ‌త్స‌రాల నిరీక్షణ అనంతరం​ సాధించిన విజయం కావడంతో వీరి ఆనందానికి అవధుల్లేవు. భార‌త ఆటగాళ్లు మ్యాచ్‌ అనంతరం డ్యాన్స్‌లు, కేకలు, ఈలలతో డ్రెసింగ్‌ రూమ్‌ను హోరెత్తించగా.. ఇండియా క్రికెట్ అభిమానులు అక్కడా, ఇక్కడా అన్న తేడా లేకుండా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో టీ ఇండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్ తనదైన స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

నాగిని డ్యాన్స్‌ వేస్తూ భార‌త టీం గెలుపును మనస్పూర్తిగా ఆస్వాధించాడు. ట్విటర్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. “టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు అంటూ కామెంట్ పెట్టాడు. ఎవ‌రికి నచ్చిన విధంగా సెలబ్రేట్‌ చేసుకుంటాం.. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు” అంటూ క్యాప్షన్‌ను రాశాడు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియలో చ‌క్కర్లు కొడుతోంది. ఎప్పుడూ సైలెంట్‌ కనిపించే కైఫ్‌.. ఇలా నాగిని డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేయడం సామాజిక మాధ్య‌మాల్లో ఉండేవారిని విపరీతంగా ఆకట్టుకుంది.

కైఫ్‌.. భార‌త విజయాన్ని నూరు శాతం ఆస్వాధిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో భార‌త క్రికెట్ టీం 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే మ్యచ్‌లో 368 పరుగుల ల‌క్ష్యాన్ని సాంధిచేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఉమేశ్‌ యాదవ్‌ (3/60), శార్దూల్‌ ఠాకూర్‌ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) భౌలింగ్ ధాటికి 210 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఘోరంగా ఓడిపోయింది. 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకంజ‌లో ఉంది. దీనికి ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news