కొన్నిసార్లు ఘోర రోడ్డుప్రమాదాలు జరిగిన కేసుల్లో పేషెంట్స్ కోమాలోకి వెళ్తారు. అలా వెళ్లి కొందరు నెలరోజుల్లో కోలుకుంటే..మరికొంతమంది సంవత్సరాలైనా అలానే ఉండిపోతారు. ఇంకొంతమంది ఆ కోమాలోనే చనిపోతుంటారు. అయితే కోమాలోంచి కోలుకున్న వారు కొందరు సాధారణంగా గతం మర్చిపోతుంటారు. మరికొందరికి అప్పటివరకూ లేని ఆరోగ్యసమస్యలు వస్తుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ యవతికి మాత్రం వీటికి భిన్నంగా జరిగింది. ఆమె కోమాలోంచి బయటకు వచ్చాక గతం మర్చిపోలేదు కానీ మాతృభాషను మర్చిపోయింది. వేరే భాష మాట్లాడేస్తుంది. అసలు ఏం జరిగిందంటే..
సమర్ డియాజ్ అనే 24ఏళ్ల యువతి…గత ఏడాది అనుకోకుండా జరిగిన ఓ భయానక ప్రమదంలో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లింది. రెండు వారాల తర్వాత సమర్ సృహలోకొచ్చాక స్పష్టంగా మాట్లాడలేకపోయింది. అనేక స్పీచ్ థెరపీల తర్వాత ఆమె మాట్లాడటం అయితే ప్రారంభించింది. వైద్యం అందించేవారికి ఎందుకో అనుమానం వచ్చి ఏ దేశానికి చెందిన పౌరురాలు అని సమర్‌ను ప్రశ్నించగా.. ఆమె ఇచ్చిన సమాధానం విని అందరూ బిత్తరపోయారు.
అమెరికా నివాసి అయిన సమర్ డియాజ్ తన మాతృభాషకాకుండా అసలు పరిచయమేలేని న్యూజిలాండ్ భాష మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ యువతి తను ఎప్పుడూ న్యూజిలాండ్ వెళ్లలేదని కూడా చెప్పింది. దీని గురించి సన్నిహితులు వెద్యులను ప్రశ్నించగా ఆమె ఓ అరుదైన వ్యాధి బారీన పడ్డట్టు వైద్యులు ధృవీకరించారు. వైద్యపరిభాషలో ఈ డిసీజ్‌ను ఫారెన్ యాక్సెంట్ సిండ్రోమ్ అని అంటారట. ఇది వస్తే అప్పటివరకూ మాట్లాడే మాతృభాషకాకుండా వేరే ఇతర భాషను మాట్లాడుతారని వైద్యులు తెలిపారు.
ఎవరికైనా ప్రమాదాలు జరిగితే గుండెపోటు రావడం నుంచి పరిస్థితి విషమించి ఆఖరికి మరణించడం వరకు జరుగుతుంటాయి. ఏదిఏమైనప్పటికీ సమర్ డియాజ్ మృత్యువును జయించినా.. గతాన్ని గుర్చుంచుకున్నా… మాతృభాషకు బదులు న్యూజిలాండ్ భాష మాట్లాడటం అనేది మాత్రం వారి కుటుంబసభ్యులతో పాటు అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తుంది.
ప్రమాదాలు జీవితంలో పెద్దమార్పునే తెస్తాయనంటంలో ఏమాత్రం సందేహం లేదు. కొన్ని ఘోరప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయిరోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. చెట్టంత కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయడంటే..ఆ తల్లిదండ్రలు బాధ వర్ణానాతీతం. ఇవన్నీ ఒక బాధ అయితే.. ఇలా కోమాలకి వెళ్లి గతాన్ని మర్చిపోవటం మరో బాధ..సమర్ విషయంలో అయితే వీటికి భిన్నంగా జరిగినందకు కాస్త మంచివిషయమే అయినా..మాతృభాషను మర్చిపోవటం మాత్రం కాస్త ఇబ్బంది అనే చెప్పాలి.