బ్యాచిలర్స్… డబ్బు ఆదా చేసుకోండిలా…!

ఈ రోజుల్లో వంద రూపాయలు ఆదాయం వస్తే 110 రూపాయల ఖర్చు ఉంటుంది… మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, ఆదాయానికి మించిన కోరికలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా మనను ప్రభావితం చేస్తూ ఇబ్బంది పెడుతున్నాయి. ఆధునికత వైపు అడుగులు వేయడంలో యువత అత్యంత వేగంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆదాయం… భద్రత పరుచుకోవడం అనేది అత్యంత కీలకం. భవిష్యత్తుని ప్రతీ నిమిషం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిపుణులు… ముఖ్యంగా ఉద్యోగాలు చేసే యువతకు అనేక సూచనలు చేస్తున్నారు.

ఒకసారి పెళ్లి అయింది అంటే ఆదా చేయడం అనేది కల… కాబట్టి ఉద్యోగం మొదలైన నాటి నుంచే ఆదా చేయమని చెప్తున్నారు నిపుణులు. ముందుగా మీ ఆదాయానికి తగిన ఖర్చులు పెట్టకుండా ఉండేందుకు ఒక నియంత్రణను మీరే విధించుకోవాలి… అనంతరం పెట్టుబడుల రంగంలోకి దిగితే మంచిది అనేది నిపుణుల మాట. ప్రతీ నెలా… మీరు కనీసం 5 వేలను ఆదా చేసుకోగలగాలి అనేది వారు సూచిస్తున్నారు. ఒక దీర్ఘ కాలిక లక్ష్యాన్ని మీరు నిర్దేశిన్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆ లక్ష్యం కోసం ఆదాయ మార్గాలను కూడా పెంచుకోవడం తో పాటుగా…

ఉన్న ఆదాయాన్ని… కట్టుదిట్టంగా భద్రపరుచుకునే ప్రణాళిక చాలా అవసరమని అంటున్నారు. ఉదాహరణకు మీరు 50 వేలు లక్ష్యంగా పెట్టుకుని వాటిని సరైన మార్గంలో మీరు పెట్టుబడి పెట్టగలగాలి. ఇందుకోసం సరైన పెట్టుబడి మార్గాలు అన్వేషించాలి. ఆదాయం అనేది ఒక ఉద్యోగంలో రావడం లేదు అనుకుంటే చిన్న చిన్న ఉద్యోగాలను వెతుక్కుని ఆ డబ్బులు మీ పెట్టుబడులకు వినియోగించడం మంచిది. ఇక బంగారం కొనుగోలు అనేది ఉత్తమమని కొందరు అంటూ ఉంటారు. కాని దాన్ని ఆభరణాల రూపంలో వద్దు అనేది కొందరి మాట. రోజు వారి వ్యయాలను తగ్గించడంతో పాటుగా అప్పుల జోలికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ వాడకాలను అదుపు చేసుకోవాలి… పెట్టుబడి పెట్టె ముందు దీర్ఘకాలిక లక్ష్యాలు అనేది చాలా అవసరం.