ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాల ప్రజలను అల్లకల్లోలం చేస్తుంది. ఈ మహమ్మారి థాటికి ప్రజలు చిగురుటాకుల వణికిపోతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌కు మందు లేకపోవడంతో.. ప్రపంచదేశాలకు మరింత సవాల్‌గా మరింది. ఇక ఈ రక్కసికి చెక్ పెట్టాలంటే వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడమే ముందున్న మార్గులుగా కనిపిస్తున్నాయి. దీంతో పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి. ఈ క్రమంలోనే ప్రజలు అనవసరంగా బయటకు వస్తే పోలీసులు లాటీలకు పని చెబుతున్నారు.
అయితే ఈ లాక్‌డౌన్ దెబ్బ మందుబాబులపై తీవ్రంగా పడింది. ఎప్పుడూ చుక్కేసి కిక్కులో ఉండే వారు ఇప్పుడు ఒక్క చుక్క కూడా మందు దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మరి కొందరు పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తుండడంతో వారి కుటుంబం సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఎఫెక్ట్ తోనే ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు మందుబాబులు పోటెత్తున్నారు. ఏదో ఒక్కరోజు జనతా కర్ఫ్యూయే కదా అని మద్యం నిల్వ చేసుకోని మందుబాబులకు.. ఆ తర్వాత కర్ఫ్యూ కాస్త 40 రోజుల లాక్‌డౌన్ అయింది.
రోజు మద్యం సేవించడం అలవాటు ఉన్నవారికి ఒక్కసారిగా మందు దొరక్కపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. పోని ఎంత ఖర్చు పెట్టి అయినా పర్వాలేదు.. కనీసం క్వాటర్ అయినా కొందాం అంటే అది కూడా దొరకని పరిస్థితి. అయితే ఇలా బాధపడుతూ కూర్చునే బదులు ఇంట్లోసొంతంగా మందు తయారు చేసుకుంటే పోలా అని ఆలోచ వచ్చినట్టు ఉంది మందుబాబులకు. ఇక ఆ ఆలోచనే గూగుల్ ఆశ్రయించేలా చేసింది. దీంతో ‘ఇంటి వద్ద మద్యం తయారు చేయడం ఎలా?’ అని గూడుల్‌లో తెగ వెతికేస్తున్నారట. మార్చ్ 22 నుంచి 28 వరకు ఆన్ లైన్ సర్చింగ్ లో ఇదే టాప్ అని తేలడంతో అందరూ ఆశ్యర్యపోయారు.