‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ గురించి ఎప్పుడైనా విన్నారా?

-

చాలామందికి స్నానం చెయ్యడం వల్ల కలిగే లాభాలా గురించి తెలుసు..అయినా, కూడా స్నానం చెయ్యాలంటే బద్దకంగా ఉంటారు.అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి..ముఖ్యంగా రోజంతా పని చేసేవారు..అయితే ఇకపై స్నానం చేయడానికి ఎక్కువగా శ్రమ పడక్కర్లేదు. అలాగే చాలా మంచి వాతావరణంలో స్నానం చేస్తూ ఎంతో ప్రశాంతత పొందొచ్చు..ఎందుకోసం అసలు ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరమే లేదు.

ప్రత్యేకతలు ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిలాక్సింగ్ వీడియోని ప్లే చేస్తూనే మీ శరీరాన్ని శుభ్రపరిచే ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ వచ్చేస్తోంది. దీనిని ప్రస్తుతం జపాన్లోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ మెషిన్లోని అల్ట్రాసోనిక్ బాత్ చర్మ రంధ్రాల నుంచి ధూళిని తొలగించే అత్యంత చక్కటి గాలి బుడగలను హై-స్పీడ్ నీటితో బాడీని కడిగేస్తుంది.

బబుల్ టెక్నాలజీని ఉపయోగించి షవర్ హెడ్లు, బాత్టబ్లను రూపొందించే ఒసాకా ఆధారిత సాంకేతిక సంస్థ దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తోంది. ‘ప్రాజెక్ట్ ఉసోయారో’గా పిలిచే ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ 2024 నాటికి పూర్తవుతుందని, ఆపై 2025 ఒసాకా ఎక్స్పోలో ప్రదర్శించబడుతుందని అంచనా. రిపోర్ట్స్ ప్రకారం ఈ మెషిన్ 15 నిమిషాల పాటు మనిషికి స్నానం చేయిస్తుంది. ఈ సమయంలో అది చక్కటి సంగీతం వినిపిస్తూ వీడియో కూడా చూపిస్తుంది. 15 నిమిషాల సమయంలో మనిషి శరీరం అంతా శుభ్రపరిచి, మసాజ్ చేసి, డ్రై చేస్తుంది. వినడానికి నిజంగా గమ్మత్తుగా ఉంది కదూ..

ఇప్పటివరకు బట్టలు, వంట సామాగ్రి క్లీన్ చేసే మెషిన్లు వచ్చాయి కానీ మనుషులకు స్నానం చేయించే మెషిన్లు అందుబాటులోకి రాలేదు. అయితే జపనీయులు ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలిసిన ప్రజలంతా నోర్లు వెల్లబెడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news