EMI కట్టకపోతే వీళ్ళు ఫోన్ లాక్ చేస్తారు తెలుసా..?

-

చాలా మంది ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కింద ఏదో ఒక వస్తువును కొనుగోలు చేస్తూ ఉంటారు. దీని వల్ల డబ్బులుని ఒకే సారి ఇవ్వక్కర్లేకుండా ఇన్స్టాల్మెంట్ చొప్పున వాళ్లకి పే చెయ్యవచ్చు. ఇదిలా ఉంటే దేశంలో కొన్ని మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వాటి కోసం చూస్తే నిజంగా షాక్ అవుతారు.

మరి దాని కోసం ఇప్ప్పుడు మనం పూర్తిగా చూద్దాం.. నిజంగా వీళ్ళు చేసే మోసం అంతా ఇంతా కాదు. ఎక్కువగా ఈ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు గ్రామాలను పట్టణాలని టార్గెట్ చేస్తున్నారు. ముందు తక్కువ వడ్డీ రుణానికి ఫోన్ ఇస్తామని కొన్ని గ్రామాలలో పట్టణాలలోని ప్రజలని టార్గెట్ చేస్తూ అక్కడ ఉండే వాళ్ళని ఆకర్షిస్తున్నాయి.

ఆ తర్వాత వాళ్లు కనుక ఈఎంఐ చెల్లించ లేక పోతే అప్పుడు వాళ్ళ ఫోన్ ని లాక్ చేస్తున్నారు. నిజంగా నమ్మశక్యంగా లేదు కదా కానీ ఇదే నిజం అండి. ఈ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు పట్టణాల్లోని మరి కొన్ని గ్రామాలలో వాళ్ళని టార్గెట్ చేస్తూ అక్కడున్న ప్రజలని ఈ తరహాలో మోసం చేయడం కొత్తగా జరుగుతోంది.

EMI చెల్లించకపోతే వారి ఫోన్ లాక్ చేస్తున్నారు. దీంతో మొబైల్ తో ఏ కస్టమర్ కూడా ఏ పని చేయలేరు. తిరిగి వాళ్ళు EMI చెల్లిస్తేనే ఫోన్ అన్లాక్ అవుతుందని కొనుగోలు వేళల్లోనే ఇటువంటి నిబంధనల్ని పెడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఇలా ఫోన్ కొనుక్కోవాలంటే ముందుగానే నిబంధనలు పూర్తిగా చదువుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news