ఈ తప్పులు చేస్తే మీ స్మార్ట్ ఫోన్ త్వరగా పాడై పోతుంది జాగ్రత్త..!!

-

ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. టెక్నాలజీ పెరిగినకొద్ది చిన్న నుంచి పెద్దల వరకు వారి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. ఇక స్మార్ట్‌ ఫోన్‌ ఉందంటే చాలా అందులో రకరకాల యాప్స్‌తో నిండిపోతుంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో అవసరమైన దానికంటే ఎక్కువ యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం వల్ల ఫోన్‌ నెమ్మదిస్తుంటుంది. దీని వల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు. ఫోన్‌లలో అనవసరమైన యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయడం మానుకోవడం మంచిది. ఎందుకంటే అవి ప్రాసెసర్‌ను ప్రభావితం చేస్తాయి. దాని కారణంగా అది నెమ్మదిగా మారుతుంది..

అంతేకాదు బ్యాటరీ కూడా పాడై పోతుంది..బ్యాటరీ వేడెక్కడంతో మరింత సమస్య ప్రారంభం అవుతుంటుంది. మీరు గంటల తరబడి మొబైల్ స్క్రీన్‌ను ఆఫ్ చేయకపోతే, దానిని నిరంతరం ఉపయోగిస్తే దీని కారణంగా మదర్ బోర్డ్ ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు..ఫోన్ పూర్తిగా ఫోన్ పాడై పోవచ్చు లేదా ఫోన్ కు సంబంధించిన ముఖ్యమైనవి ద్యామెజ్ అవుతాయి.. అందుకే చాలా జాగ్రత్తగా వాడాలి..

ఫోన్‌ను శుభ్రపరిచేటప్పుడు మీరు సరైన సాధనాలను ఉపయోగించాలి. ఇంట్లో పడి ఉన్న సాధనాలను నివారించండి ఎందుకంటే అవి స్మార్ట్ ఫోన్‌కు పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌ను శుభ్రపరిచేటప్పుడు నీటి ఆధారిత క్లీనర్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. వీటి కారణంగా స్మార్ట్‌ఫోన్ అంతర్గత భాగాలకు భారీ నష్టం వాటిల్లవచ్చు. వాటిని మరమ్మతు చేయడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌లను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. వాటిలో ఏదైనా ధూళి పేరుకుపోతుంటే దానిని ప్రొఫెషనల్‌ తో శుభ్రం చేయించాలి.. ఏదైనా కూడా మనం వాడే పధ్ధతి లో ఉంటుంది..ఇది గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news