ఫ‌స్ట్‌ సోలార్ పవర్ ట్రెయిన్.. దీంతో 90 వేల లీట‌ర్ల‌ డీజిల్ సేవ్‌

-

సోలార్ పవర్ ట్రెయిన్ వల్ల దాదాపు సంవత్సరానికి 12 లక్షల రూపాయలను ఇండియన్ రైల్వేస్ కు ఖర్చు తప్పుతుంది. సంవత్సరానికి 21 వేల లీటర్ల డీజిల్ ను సేవ్ చేయొచ్చు. సాధారణంగా డీజిల్ ట్రెయిన్లు వెలువరిచే కార్బన్ లాంటి వాయువులను ఈ ట్రెయిన్ వెలువరించదు.

ఇండియన్ రైల్వేస్ మొట్టమొదటి సోలార్ పవర్ ట్రెయిన్ ను ప్రారంభించింది. ఇండియన్ రైల్వేస్ దీన్ని నిర్మించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేశారు. దీన్ని జులై 14, 2017లోనే ప్రారంభించారు. ఈ ట్రెయిన్ ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా స్టేషన్ నుంచి హర్యానాలోని ఫరుఖ్ నగర్ స్టేషన్ మధ్య ఈ ట్రెయిన్ పరుగులు పెడుతుంది.

సోలార్ పవర్ ట్రెయిన్ వల్ల దాదాపు సంవత్సరానికి 12 లక్షల రూపాయలను ఇండియన్ రైల్వేస్ కు ఖర్చు తప్పుతుంది. సంవత్సరానికి 21 వేల లీటర్ల డీజిల్ ను సేవ్ చేయొచ్చు. సాధారణంగా డీజిల్ ట్రెయిన్లు వెలువరిచే కార్బన్ డయాక్సైడ్ వాయువును ఈ ట్రెయిన్ వెలువరించదు. దీని వల్ల ఒక సంవత్సరం పాటు తొమ్మిది టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువును గాల్లో కలవకుండా ఆపొచ్చు.

మేకిన్ ఇండియాలో భాగంగా ఈ ట్రెయిన్ ను ఇండియన్ రైల్వేస్ రూపొందించింది. దీనికి పవర్ బ్యాక్ అప్ కూడా ఉంటుంది. బ్యాటరీతో ట్రెయిన్ కనీసం 72 గంటలు నడుస్తుంది. ఒక రోజులో 17 యూనిట్ల విద్యుత్ ను సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేస్తాయి.

ఇలా.. ఈ ట్రెయిన్ వల్ల పర్యావరణ పరంగా.. ఇతర విషయాల పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద ఈ సోలార్ ట్రెయిన్ ను ఇండియన్ రైల్వేస్ రూపొందించింది. ప్రస్తుతం ఈ ట్రెయిన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. భవిష్యత్తులో సోలార్ ట్రెయిన్లు మరిన్ని రావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news