గబ్బిలం అంత రుచిగా ఉంటుందా…?

-

చూడగానే చిరాకు వచ్చే జీవి పేరు చెప్పమంటే ఎం చెప్తారు…? చాలా మంది గబ్బిలం పేరే చెప్తారు. ఎందుకంటే దాని రూపం, దాని అవతారం అన్నీ కూడా చాలా చిరాకుగా ఉంటాయి అనే సంగతి అందరికితెలిసిందే. కాని కొన్ని దేశాల్లో మాత్రం వాళ్ళ బండ బడ,అదో అద్భుతమైన వంటకంగా ఆరగిస్తూ ఉంటారు. తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో దాన్ని మించిన రుచి ఎక్కడా ఉండదు అంటారు అక్కద ప్రజలు.

చైనాలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని పక్కన పెట్టారు. దాదాపు వాటిని తినే అన్ని దేశాలు కూడా పక్కన పెట్టేశాయి. అయితే ఒక దేశంలో మాత్రం దాని రుచి మరెక్కడా దొరకదు అంటూ తింటున్నారు. ఇండొనేసియాలోని ఉత్తర సులావెసీలో ఉన్న మినహాసన్ ప్రజలు పానికి అనే గబ్బిలం కూర వండుతారు. గబ్బిలం తల, రెక్కల్ని కూడా కూరలా వండి లోట్టలేసుకుని తింటారు అక్కడి మంద.

అక్కడ కరోనా లేదు కాబట్టి అక్కడి ప్రజలు వ్యాపారులు దీన్ని చక్కగా ఆదరిస్తున్నారు. అక్కడ వాళ్ళు గబ్బిలమే ఎక్కువగా తింటూ ఉంటారు. మన దగ్గర చికెన్ కి ఉన్న డిమాండ్ అక్కడ గబ్బిలంకి ఉంటుంది. మనం కోడిని కాల్చినట్లు వాళ్లు గబ్బిలాన్ని కాల్చుతారు. ఆ తర్వాత గబ్బిలాన్ని ముక్కలు చేసి, పుదీనా, కొత్తిమీర, మసాలాలు, కొబ్బరి పాల వంటివి వేసి వండి అమ్ముతారు అన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news