చేతిలో మందు గ్లాసుతో శివుడి ఫోటో.. ఇన్స్టాగ్రామ్ పై విమర్శలు.. ఢిల్లీలో ఎఫ్ ఐ ఆర్ ఫైల్.

-

సోషల్ మీడియా సంస్థలు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ మనోభావాలను కించపర్చడంలో ముందున్నాయేమో అనిపిస్తుంది. తరచుగా జరుగుతున్న సంఘటనలని చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. ఇప్పటికే ఆన్ లైన్లో వస్తువులు అమ్మే అమెజాన్ సంస్థ, కర్ణాటక ప్రజల మనోభావాలని దెబ్బతీసింది. కెనడా దేశానికి చెందిన అమెజాన్ సైట్లో బికినీపై కర్ణాటక జెండా రంగులను ఉంచి విమర్శల పాలైంది. ఇంకా గూగుల్ చేసిన నిర్వాకం కూడా ఇలాంటిదే. భారతీయ భాషల్లో అత్యంత అసహ్యమైన భాష ఏదీ అని సెర్చ్ చేయగా కర్ణాటక అని చూపింది.

ఈ రెండు సంఘటనలు కర్ణాటక ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసాయి. తాజాగా జరిగిన సంఘటన హిందూమతస్తులకు వ్యతిరేకంగా ఉంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ అయిన ఇన్స్టాగ్రామ్, తన జిఫ్ సెర్చింగ్ లో కొన్ని ఫోటోలను ఉంచింది. అందులో ఒకానొక ఫోటో హిందువుల సెంటిమెంటును వ్యతిరేకంగా ఉంది. చేతిలో మందు గ్లాసు ఉన్న శివుడి ఫోటోను జిఫ్ సెర్చ్ లో ఉంచిన ఇన్స్టాగ్రామ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. శివుడి చేతిలో మందు గ్లాసు ఉంచడం హిందువుల మనోభావాలను కించపర్చడమే అంటూ విమర్శలు వస్తున్నాయి.

ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. ఢిల్లీలో ఈ విషయమై కేసు నమోదు చేసారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇతర సోషల్ మీడియా సంస్థల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. మరి ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news