బీటా, డెల్టా వేరియంట్ల‌పై స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న కొవాగ్జిన్‌!

-

ప్ర‌స్తుతం ఇండియాలో కొవిడ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు వ‌స్తున్న ర‌క‌ర‌కాల కొవిడ్ వేరియంట్లు భ‌య‌పెడుతున్నాయి. అయితే కొవాగ్జిన్‌ (covaxin) ఈ కొత్త వేరియంట్లను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్న‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) లోని శాస్త్రవేత్తలు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

 

కొవాగ్జిన్‌  | covaxin

డెల్టా B.1.617.2 వేరియంట్‌ తో పాటు SARS-CoV-2, బీటా B.1.351 వైర‌స్‌వేరియంట్ల నుంచి కొవాగ్జిన్ ర‌క్షిస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిని నివారించ‌డంలో కొవాగ్జిన్ బాగా ప‌నిచేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలుపుతున్నారు.

బి.1.351, బి.1.617.2 వేరియంట్ల‌పై నిర్వ‌హించిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయని సోమవారం బయోఆర్క్ సివ్ ప్రీప్రింట్ సర్వర్‌లో పోస్ట్ చేసింది. 17 మందికి బీటా, డెల్టా వేరియంట్‌లకు వ్యతిరేకంగా రెండు డోసుల కొవాక్సిన్ టీకాలు వేసిన శాస్త్ర‌వేత్త‌లు మంచి ఫ‌లితాలు రావ‌డాన్ని గ‌మ‌నించారు. ఈ విష‌యాల‌ను ఐసీఎంఆర్-ఎన్‌ఐవి శాస్త్రవేత్త, గ్రూప్ లీడర్ అయిన డాక్టర్ ప్రగ్యా యాదవ్ స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news