భ‌ర్త‌ ఆత్మహత్య.. డెడ్ బాడీ కోసం ఏడుగురు భార్యలు..

-

ఉత్తరాఖండ్‌కు చెందిన‌ పవన్ కుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. అతని మృతదేహాన్ని ఇంటికి తరలించగా.. భార్య తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఇంత‌లోనే అక్క‌డ‌కు మరో ఆరుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. అయితే ఇక్కడే అసలు స్టోరీ మొదలైంది. ఒక్కొక్క‌రూ ‘మా ఆయన అంటే మా ఆయన’ అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టారు.

ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ గొడ‌వ‌ల‌కు తిగారు. అక్క‌డున్న వారంద‌రూ అయోమ‌యంలోకి వెళ్లిపోయారు. ఇంత‌లో పోలీసుల ఎంట్రీతో గొడ‌వ కాస్త త‌గ్గింది. అయితే వారంతా తాము అతని భార్యలమని చెప్పుకుంటుండంతో పోలీసుల‌కు ఊహించని పరిణామం ఎదురైంది. మ‌రో విశేషం ఏంటంటే.. అక్క‌డ ఉన్న మ‌హిల‌ల్లో ఏ ఒక్క‌రికీ మ‌రొక‌రు తెలియ‌దు. దీంతో ఏం చేయాలో తెలియక.. తలలు పట్టుకున్నారు. చివ‌ర‌కు వారందరినీ ఎలాగోలా శాంతపరిచాక.. అతని అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ గొడవపై అప్పుడే ఏమీ తేల్చలేమని.. మరికొద్ది రోజులు ఆగాక.. మృతుడి భార్యలపై ఒక అవగాహన వస్తుందని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news