ఎన్నికష్టాలు వచ్చినా ముఖం మీద చిరునవ్వు మాత్రం పోకూడదని సినిమాల్లో చెప్తుంటారు. నవ్వలేకపోవటం కూడా ఒక రోగం అంటుంటారు. అవును..ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లు మీ గ్యాంగ్ లో ఉంటే మాత్రం అసలు విడిచిపెట్టోదు. నవ్వితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. నవ్వు మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు నవ్వు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మీరు 10 నిమిషాలు మనసారా నవ్వితే..ఎలాంటి నొప్పి అయినా..తగ్గినట్లు అనిపిస్తుంది. శరీరంలో శ్వాస వ్యాయామం చేయడానికి నవ్వు ఒక మార్గం అని చాలా పరిశోధనలు నిరూపించాయి. ఇది మన శరీరానికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. రోజంతా మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది.నవ్వని వారితో పోలిస్తే నవ్వే వారిలో రక్తప్రసరణ స్థాయి మెరుగ్గా ఉంటుంది. కనుక ఎప్పుడూ నవ్వడం అలవాటు చేసుకోవాలి.
కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. నవ్వు కూడా వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతుందని మీకు తెలుసా..నవ్వు శరీరంలో యాంటీవైరల్, ఇన్ఫెక్షన్-నిరోధక కణాలను పెంచుతుంది. నవ్వు కూడా నొప్పిని తగ్గిస్తుంది. లాఫింగ్ థెరపీ వల్ల నొప్పిని తగ్గించవచ్చు. నవ్వు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరానికి అనుకూలతను తెస్తుంది. మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది.
మీరు చూసే ఉంటారు..మార్నింగ్ పార్కుల్లో..అందరూ బాగా గట్టిగా నవ్వుతారు. లాఫింగ్ థెరపీ శరీరాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. కష్టాలు వచ్చిన ప్రతిసారి..కుంగిపోకుండా..గతంలో జరిగిన మధురజ్ఞాపకాలను తలుచుని..దైర్యంగా ముందుకు వెళ్లడమే.
ఒక పరిశోధనలో..అబ్బాయిలకంటే..అమ్మాయిలే ఎక్కవుసార్లు నవ్వుతారని తేలింది. నవ్వితే చర్మంలో కూడా మంచి గ్లోయింగ్ వస్తుంది. ఎప్పుడు ముఖం ముడుచుకుని ఉంటారు కొందరు. ఇంకొందరు..ఎంత పెద్ద జోక్ చెప్పినా..అసలు కొంచెం కూడా నవ్వరే..ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి వాళ్లు కచ్చితంగా ఉంటారు. ఇంతకీ మీరు ఏ కేటగిరీలోకి వస్తారు.?