కాలాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. రోజుకి 24గంటలు ఎలా గడిచిపోతున్నాయో అర్థం కాకుండానే దూసుకుపోతుంది కాలం. అప్పుడే టీనేజిలోకి ఎంటర్ అయినయినట్టు అనిపిస్తుండగానే అది పూర్తయ్యి, 20ల్లోకి వచ్చేస్తాం. 20ల్లో ఏవేవో చేయాలని అనుకుంటుండగానే 30దాకా వచ్చేస్తాం. ఐతే మీ వయసు 30కి చేరుకుంటే జీవితంల్ కొన్ని విషయాలని పూర్తి చేసేయాలి. 30లోపు ఆ పనులన్నీ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
డ్రైవింగ్ నేర్చుకోండి
చాలా మందికి కారు నడపడం రాదు. మీ వయసు 30కి చేరుకునే లోపే కారు నడపడం నేర్చుకోండి. ఇది అవసరమా అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రతీసారీ మీతో పాటు డ్రైవర్ గా రావడానికి ఎవరూ ఖాళీ ఉండకపోవచ్చు.
ఈత నేర్చుకోండి
ఈతని మించిన వ్యాయామం లేదు. శరీరానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒత్తిడి ఎక్కువైనపుడూ ఈత కొడితే దాన్నుండి బయటపడే అవకాశం ఉంది.
పెట్టుబడులు పెట్టండి.
చేతిలో డబ్బులున్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది చాలా తెలివిగా ఆలోచించుకోవాలి. మనకి తెలియని వాటిల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దు. తెలిసిన దాన్లోనేఏ ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.
పెళ్ళి
30కి చేరుకోక ముందే పెళ్ళి చేసుకోండి. జీవితంలో తోడు కావాలని అనిపిస్తే 30కి ముందే చేసుకోవడం బెటర్.
వంట
వంట నేర్చుకోవాలి. కనీసం మూడు ఆహారాలని ఎలా వండుతారో తెలుసుకోండి. ముందే చెప్పినట్టు ప్రతీసరీ మనకంటూ తోడుగా నిలబడడానికి
ఎవరూ ఉండకపోవచ్చు.
ట్రావెల్: ఒక్కసారైనా ఒంటరిగా ట్రావెలింగ్ కి వెళ్ళండి. పెళ్ళయ్యాక ఎలాగూ ఒంటరిగా వెళ్ళలేరు. కాబట్టి 30కి చేరుకోకముందే ఆ పని చెయ్యండి.