మొదటి ప్రేమ నేర్పే కొన్ని జీవిత పాఠాలు.. అవి నేర్చుకోవడంలో ఆలస్యం చేస్తే ఇక అంతే.

-

బంధాలన్నింటిలో అత్యంత ఆసక్తికరమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ బంధమే. ప్రేమంటే చాలు టీనేజీ నుండి వయసు మళ్ళుతున్న వారిలోనూ ఒక రకమైన ఉద్వేగం వస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఉన్నంత ఉద్వేగం ఎప్పటికీ ఉండిపోతే వారి జీవితంలో చాలా ప్రేమ ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ప్రేమలో ఉన్నప్పుడు ఒకలా ఉండి, పెళ్ళి తర్వాత ఈ ప్రేమలేంట్రా బాబూ అని ఉన్నట్టయితే వారి ప్రేమలో ఏదో లోపం ఉన్నట్టే. అదంతా పక్కన పెడితే ప్రస్తుతం బ్రేకప్ లు ఎక్కువవుతున్నాయి. కొన్ని కొని సార్లు చాలా చిన్న విషయాలకే బ్రేకప్ జరగడం చూస్తూనే ఉన్నాం. బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్రేమిస్తున్నారు. అలా ప్రేమించి మళ్ళీ బ్రేకప్ అంటున్నారు.

మొదటి ప్రేమ తర్వాత మళ్ళీ బ్రేకప్ అనేది చాలా బాధతో కూడుకుని ఉంటుంది. అసలు మొదటి బ్రేకప్ తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అవేంటో చూద్దాం.

బ్రేకప్ కి ముఖ్య కారణం ఎక్స్ పెక్టేషన్స్. ఒకరి మీద ఒకరు ఎవరికి నచ్చినట్టు వారు అంచనాలు పెట్టేసుకుని, వారి అంచనాల ప్రకారం లేరని బ్రేకప్ చెప్పుకుంటారు. మొదటి బ్రేకప్ తర్వాత అంచనాలు పెట్టుకోవద్దనే విషయం తెలియాలి.

ఓపిక.

ప్రేమ చాలా ఓపికని నేర్పుతుంది. ఒక్కోసారి ఎదుటివారు చెప్పేది చాలా ఓపికగా వినాల్సి వస్తుంది. అలా వినకే బ్రేకప్ లు జరుగుతాయి. కనీసం రెండవసారైనా అది నేర్చుకోవాలి.

కొన్ని కొన్ని సార్లు కామన్ సెన్స్ మర్చిపోతాం

ఏమవుతుందో తెలియదు ఊరికే అరిచేస్తారు. ఫస్ట్ లవ్ లో ఉన్నప్పుడు చాలా సార్లు చాలామంది కామన్ సెన్స్ లేకుండా అవతలి మీద అరిచిన సందర్భాలు అనేకం. బ్రేకప్ కి ఇది కూడా ఓ కారణమే అని తెలుసుకోవాలి.

ప్రేమ, స్నేహితుల మధ్య బ్యాలన్సింగ్

ప్రేమనీ, స్నేహితులని ఎలా బ్యాలన్స్ చేయాలో ఒక బ్రేకప్ తర్వాత కూడా తెలియలేదంటే మీరు రెండో బ్రేకప్ కి రెడీగా ఉన్నారనే అర్థం. రెండు విరుద్ధ భావాలని అర్థం చేసుకుని వారి వారికి తగినట్టుగా నిన్ను మార్చుకోవాలి.

ప్రేమిస్తున్న వారి కుటుంబాలకి గౌరవం ఇవ్వడం

నువ్వు ప్రేమించే వారి కుటుంబ సభ్యులకు గౌరవం ఇవ్వడం నేర్చుకుంటావు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది.

పై విషయాలు మొదటి ప్రేమ నేర్పిస్తుంది. ఇటువంటి వాటిల్లో ఎక్కడో ఓ చోట మిస్టేక్ జరగడం వల్లే బ్రేకప్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news