ఏంట్రా ఇది.. ఒక బైకుపై ఐదుగురా..వీడియో..

సోషల్ మీడియాలో కొన్ని బైక్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.అవి ఫెమస్ అవ్వడం కోసం చేస్తున్నారో లేక ఇంకేదానికోసం చేస్తున్నారో తెలియదు .. కానీ అలాంటి వీడియోలకు లైకులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. వాటికి పోలీసులు జరిమానాతో సరి పెట్టలేదు.. కొన్ని సార్లు జైలు పాలు అయ్యేలా చేస్తున్నారు.అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఐదురుగు వ్యక్తులు ఒకే బైకుపై ప్రయాణించి.. అరెస్ట్ అయ్యారు. వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. అది పోలీసుల కంటపడింది.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారని చర్యలు తీసుకున్నారు. నిందితులపై మోటర్ వాహనాల చట్టం ప్రకారం కేసు రాసిన పోలీసులు.. వారికి రూ.6,500 ఛలాన్ వేశారు. అక్కడితే వదిలెయ్యలేదు. ప్రజలకు అశాంతి కలిగించారంటూ.. అరెస్టు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టి.. తర్వాత జైలుకు పంపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని పరిశీలించారు.

ఐదురుగు వ్యక్తులు ఒకే బైక్‌పై వెళ్తూ కనిపించారు. ఆ వాహనం నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించింది. దాని ఆధారంగా వారిని గుర్తించి చర్యలు తీసుకున్నాం. బైక్‌ని స్వాధీనం చేసుకొని.. ఐదుగురినీ అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్నారు.. బైక్‌పై ఎంతో ఆనందంగా వెళ్తున్నారు. ఎవరూ చెయ్యని సాహసం తాము చేస్తున్నామని ఫీలవుతున్నారు. కానీ వారు చట్టాన్ని అతిక్రమిస్తున్నారని గ్రహించ లేకపోయారు.

ఇలాంటి తప్పులే.. మన కెరీర్‌ని దెబ్బతీస్తాయంటున్నారు పోలీసులు.. వైరల్ అవ్వాలని వాళ్ళు చేసిన ప్రయత్నం ఇలా బెడిసి కొట్టింది..ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. వాళ్ళ కేర్ లెస్ పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు… ఇలాంటి వారికి ఊరికే వదలకూడదు అని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారిని బయట వదిలితే ప్రజలకు ప్రమాదం అని అంటున్నారు.. ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి..