కారంతో ఆటలా.. ఇలానే ఉంటాది మరి..

-

ఒకప్పుడు కూరల్లో ఉప్పు, కారం బాగా దట్టించి తినేవాల్లు.. వాళ్ళ పని కూడా అలానే ఉంటుంది. అందుకే వంద ఏళ్ల వరకూ బ్రతికారు.. కానీ ఇప్పుడు జనాలు మాత్రం గింత కారం ఉన్నా కూడా అమ్మో..అయ్యో..అని ఉరుకులు పెడుతున్నారు..కొంచెం ఎక్కువైతే చాలు ఓ అని వింత వింత ఎక్స్ఫ్రెషన్ ఇస్తున్నారు..అలాంటిది బాగా కారం ఉన్న వంటలతో పోటీ అంటే మాటలా..అవును మీరు విన్నది అక్షరాల నిజం కారంతో పోటీ ఉంది.. అది ఎక్కడ, ఏంటి మొదలగు విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గ్రెగొరీ ఫోస్టర్ అనే వ్యక్తి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగోలో కేవలం 8.72 సెకన్లలో మూడు కరోలినా రీపర్ మిరపకాయలను అతి వేగంగా తిన్న వ్యక్తిగా కొత్త రికార్డును సాధించాడు. అవి అత్యంత కారంగా ఉంటాయి. డౌన్‌టౌన్ శాన్ డియాగోలోని సీపోర్ట్ షాపింగ్ సెంటర్‌లో ఈ పోటీ నిర్వహించారు. ఇక గ్రెగొరీ ఫోస్టర్‌కు కారం అంటే చాలా ఇష్టం. ఏదైనా తింటే అది కారంగా ఉండేలా చూసుకుంటాడు. దీంతో ఆయన ఆ పోటీలో పాల్గొని, విజయం సాధించాడు. విజేతగా నిలిచిన ఈయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. నమ్మశక్యం కాని విధంగా గ్రెగొరీ ఆరు కరోలినా రీపర్ మిరపకాయలను తిన్నాడు.

రెండు దఫాలుగా ఆ మిరపకాయలను తినేశాడు. మొదటి ప్రయత్నం ముగిసే సమయానికి అతని నోటిలో ఇంకా మిర్చి ఉంది. దీంతో అది విజయవంతం కాలేదు.. మళ్ళీ ప్రయత్నం చేశాడు..అనుకున్నట్లుగానే రెండో ప్రయత్నంలో రికార్డు సృష్టించాడు. ఇక ఈ పోటీ పూర్తైన తర్వాత అతడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ (హావభావాలు)ను కొందరు వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది విపరీతంగా వైరల్ అయింది. ఎంతో ఫన్నీగా ఉందంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version