బ్యాంక్‌ లూటీ చేయడానికి స్వరంగం తవ్వారు.. కానీ అలా జరగడంతో ప్లాన్‌ అంతా ఫ్లాప్‌..!

-

ఒకప్పుడు దొంగతనాలకు ఇప్పుడు జరిగే దొంగతనాలకు చాలా తేడా ఉంది. కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది.. అన్నింటిలో అప్‌డెట్‌గా ఉంటున్నాం..మరి దొంగలు కూడా ఇదే పంతాలో నడుస్తున్నారు. వాళ్లు కొత్త కొత్త టెక్నిక్స్‌ వాడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన ఇంకాస్త వెరైటీ గురూ..! బ్యాంక్‌ లూటీ చేయడానికి ఏకంగా స్వరంగమే తవ్వేశారు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రోమ్‌లోని వాటికన్‌ సిటీలో మూసిఉన్న బ్యాంకును దోచేయాలని ఓ దొంగల ముఠా భావించింది. అయితే షటర్‌ తాళాలు బద్దలు కొట్టి చొరబడితే దొరికిపోతామని భావించిన ఐదుగురు సభ్యులు ఉన్న ఆ ముఠా.. ఏకంగా సొరంగం తవ్వడానికి సిద్దపడ్డారు. అందులోనుంచి బ్యాంకు లోపలికి వెళ్లి లూటీ చేయాలని భావించింది. అంతే ప్లాన్‌ బాగుంది.. అనుకున్నదే తడువుగా తమ పనిని ప్రారంభించారు.. ఓ మూసి ఉన్న దుకాణంలో నుంచి సొరంగాన్ని తవ్వడం మొదలుపెట్టారు.. ప్రతిరోజు కొద్దికొద్దిగా తవ్వుతూ.. ఇప్పటికే ఆరు మీటర్ల మేర సొరంగాన్ని తవ్వేశారు. ఇంకేముందు..మరికొన్ని మీటర్లు తవ్వేస్తే ఆ బ్యాంకు మొత్తాన్ని ఊడ్చేయొచ్చు అని ఉవ్విళ్లూరిన ఆ ముఠాకు ఊహించని ఘటన ఎదురైంది.

ఉన్నట్లుండి ఆ సొరంగం కూలిపోయింది. ఎలాగోలా నలుగురు సభ్యులు బయటపడగా.. ముఠా నాయకుడు మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. దీంతో ఏం చేయాలో బోధపడని సభ్యులు.. విషయం మొత్తాన్ని పోలీసులకు ఫోన్‌ చేసి వివరించారు. సహాయక బృందాలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆరు మీటర్ల లోతులో ఉన్న అతడిని కాపాడేందుకు నానా తంటాలు పడ్డారు. సమాంతరంగా మరో గోతిని తవ్వారు. ‘రక్షించండి, ఈ సొరంగంలోనుంచి బయటకు తీసుకెళ్లండి’ అంటూ అరుపులు వినిపించడంతో అతడిని పైపుల ద్వారా ఆక్సిజన్‌తోపాటు ద్రవరూపంలో ఆహారాన్ని అందించారు. ఎట్టకేలకు 8గంటల పాటు తీవ్రంగా ప్రయత్నించి అతడిని బయటకు తీశారు. గాయాలతో ఉన్న దొంగను ఆసుపత్రికి తరలించారు. ఆపై మిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పాపం అలా అనుకున్నది ఒకటి అయినది మరొకటిలా జరిగింది.!

Read more RELATED
Recommended to you

Latest news