జీలకర్ర సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు..!

-

వ్యవసాయం చేసి కూడా.. లక్షలు సంపాదించవచ్చు.. చాలామంది వ్యవసాయం అంటే.. కష్టం, చేసినా ఏం మిగలదు.. అప్పులపాలవడం తప్ప అనుకుంటారు.. నిజమే.. సంప్రదాయపద్ధతిలో సంప్రదాయ పంటలను పండిస్తే..అదే జరగొచ్చు..కానీ వ్యవసాయానికి కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి.. వాణిజ్య పంటలు పండిస్తే.. వ్యవసాయం దండగ కాదు పండగ అంటారు..మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి లక్షలు సంపాదించవచ్చు. అందులో ఒకటి జీలకర్ర సాగు. ప్రతి ఇంట్లో దీన్ని వాడతారు.. అంతేకాదు జీలకర్రలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే మార్కెట్లో ఏడాది పొడవునా జీలకర్రకు మంచి డిమాండ్ ఉంటుంది. మరి జీలకర్ర సాగు ఎలా చేయాలి? ఎన్ని రోజులకు పంట వస్తుంది? ఎంత లాభం వస్తుందో ఓసారి చూద్దామా..!
మనదేశంలో ఉత్పత్తి అవుతున్న జీలకర్రలో 80 శాతానికి పైగా గుజరాత్ , రాజస్థాన్‌లోనే పండిస్తున్నారు. రాజస్థాన్‌లో ఈ పంటను ఎక్కువ మంది రైతులు సాగు చేస్తారు. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో ఒక్క రాజస్థానే 28 శాతం వాటాను కలిగి ఉందని గణాంకాలు చెబుతున్నాయి… దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పంట పెద్దగా కనిపించదు.

 జీలకర్రను ఎలా సాగుచేస్తారు..?

జీలకర్ర విత్తడానికి ముందుగా పొలాన్ని అన్ని విధాలా సిద్ధం చేసుకోవాలి. చక్కగా దున్ని.. మట్టి మెత్తగా ఉండేలా.. చేసుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత పడాలి. తేలికగా ఉండే భూముల్లో జీలకర్ర బాగా పండుతుంది. దిగుబడి అధికంగా ఉంటుంది. గట్టిగా ఉండే నేలల్లో జీలకర్ర సాగు చేస్తే ఆశించినంత దిగుబడి రాదు. జీలకర్ర విత్తనాల్లో మూడు రకాల పేర్లు ప్రముఖంగా ఉంటాయి.. RZ 19, 209, RZ 223, GC 1-2-3 రకాలు మంచివని మార్కెట్లో పేరుంది. ఈ రకాల విత్తనాలను వేస్తే 120-125 రోజులల్లో పంట చేతికి వస్తుంది. ఒక హెక్టారుకు 510 నుంచి 530 కిలోల దిగుబడి వస్తుంది. అందువల్ల ఈ రకాల విత్తనాలతో జీలకర్ర సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
జీలకర్ర సాగుకు హెక్టారుకు దాదాపు రూ.30 వేల నుంచి 35 వేల వరకు ఖర్చు అవుతుంది. పంట బాగా పండితే.. ఒక హెక్టారుకు 7-8 క్వింటాళ్ల జీలకర్ర విత్తనాలు వస్తాయి. కిలో జీలకర్ర ధర రూ.100గా తీసుకుంటే.. ఖర్చులు పోను.. హెక్టారుకు రూ.40,000 నుంచి 50,000 వరకు నికర లాభం పొందవచ్చు. మీరు ఒకవేళ 5 ఎకరాల సాగులో జీలకర్రను సాగు చేస్తే రూ.2 నుంచి 2.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. 4 నెలల పంటకు రెండున్నర లక్షల ఆదాయం.. అంటే నెలకు దాదాపు రూ.60వేలు వచ్చినట్లే.. సొంత భూమి ఉంటే.. ఈ పంట వేయడం అస్సలు దండగ ఉండదు.. మీకు ఆసక్తి ఉంటే.. మీ భూమిలో ఈ పంట అనుకూలమో కాదో.. వ్యవసాయ కేంద్రంలో సంప్రదిస్తే..వ్యవసాయ అధికారులు పరీక్షించి చెప్తారు..

Read more RELATED
Recommended to you

Latest news