ఉస్మానియా బిస్కెట్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా

-

హైదరాబాద్ … పేరు వినగానే ఆహార ప్రియులకు ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీ, హాలిమ్ లతో పాటుగా తీపి , ఉప్పు కలగలసిన రుచీలోని మాయాజాలం తెలియాలంటే నోట్లో కరిగిపోయే ఉస్మానియా బిస్కెట్లు గురించి తెలియని వారు ఉండరు.

ఇరానీ చాయ్ తాగుతూ ఉస్మానియా బిస్కెట్ తినకపోతే అదేం సాయంత్రం అని పెదవి విరిచేవారూ ఉన్నారు. ఇంతకీ ఉస్మానియా బిస్కెట్ కి ఆ పేరు ఎలా వచ్చిందో , ప్రత్యేకంగా దానిని ఎక్కడ తయారు చేస్తారో చాలామందికి తెలియదు.
ఉస్మానియా బిస్కెట్ ప్రత్యేకించి ఫలానా బేకరీ లోనే చేస్తారని లేదు. హైదరాబాద్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతోనే వీటికి ఉస్మానియా బిస్కెట్లనే పేరొచ్చిందట. 70 ఏళ్ల క్రితం అబిడ్స్ దగ్గర ఓ పార్సీ బేకరిలో మాత్రమే ఇవి దొరికెవి అని సమాచారం.
ఓ సారి వాటిని అల్పాహారం లో రుచి చూసి వాటి రుచికి ముగ్దు డైన నిజాం తను ఇష్టంగా తినడంతో పాటు తన దగ్గరకు వచ్చే అతిథులకు కూడా వీటిని అందించేవారట. అలా మొదలైన ఈ నవాబీ వంటకం ప్రస్తుతం నగరంలో ప్రతి చోట దొరుకుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news