రెండేళ్లకే కొత్త నోట్లు పనికి రాకుండా పోతున్నాయ్..!

-

డీమానెటైజేషన్.. పెద్ద నోట్లను రద్దు చేసి కేవలం రెండేళ్లు అయింది.. అంతే.. అప్పుడే కొత్తగా వచ్చిన నోట్లన్నీ పనికిరాకుండా పోతున్నాయట. అవును.. ఇదివరకు దశాబ్దాల పాటు మన్నిన 500, 1000 నోట్ల కిందికి కొత్తగా వచ్చిన నోట్లు ఏమాత్రం రావట్లేవు. పాత నోట్ల కన్నా కూడా అత్యంత సెక్యూరిటీ ఫీచర్లతో ఈ నోట్లు వచ్చాయని అధికారులు చెబుతున్నా.. రెండేళ్లకే ఆ నోట్లలో నాణ్యత తగ్గిపోయిందని తెలుస్తోంది.

తక్కువ నాణ్యత కలిగిన పేపర్ ఉపయోగించి 2000, 500 నోట్లను తయారు చేయడం వల్లే అవి పనికిరాకుండా పోతున్నాయని సమాచారం. ఇలా నాణ్యత తగ్గిన నోట్లను ఏటీఎం కూడా గుర్తించదు. అప్పుడు వాటిని బ్యాంకులు ఆర్బీఐకి తిరిగి పంపించాల్సిందే. అయితే.. రెండేళ్ల కింద ఇష్యూ అయిన 2000, 500 నోట్లే కాదట. రీసెంట్ గా ఇష్యూ చేసిన కొత్త 10 రూపాయల నోటుతోనూ అవే సమస్యలు వస్తున్నాయంటూ కస్టమర్లు చెబుతున్నారు. దీంతో ఈ నోట్లను బ్యాంకులు నాన్ ఇష్యూయబుల్ కేటగిరీ కిందికి చేర్చుతున్నాయట.

ఇదివరకు నాన్ ఇష్యూయబుల్ కేటగిరీ కిందికి నోట్లను చేర్చడానికి బ్యాంకులకు ఆర్బీఐ అధికారం ఇవ్వలేదు. కానీ.. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి వస్తున్న వత్తిడి కారణంగా ఆర్బీఐ బ్యాంకులకు ఆ అధికారాన్ని ఇచ్చింది. నాణ్యత తక్కువగా ఉన్న, చిరిగిన, మురికి పట్టిన నోట్లను నాన్ ఇష్యూయబుల్ కేటగిరీ కిందికి బ్యాంకులు చేర్చనున్నాయి. వచ్చిన రెండేళ్లలోనే కొత్త నోట్లు ఇలా పనికిరాకుండా పోతే.. ఆర్బీఐ రోజూ నోట్లను ముద్రిస్తూ కూర్చోవాల్సిందే అంటూ కస్టమర్లు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news