మహబూబ్‌నగర్ లో కొత్త కప్పలు..ఆసక్తిగా తిలకిస్తున్న జనాలు..

-

దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ఆగమనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి..వరదలు కూడా కురుస్తున్నాయి.. దీంతో ఎక్కడ చూసిన వాగులు, వంకలు నిండు కుండను తలపిస్తున్నాయి.. కొత్త నీళ్ళు వస్తే, కొత్త చేపలు వస్తాయి..తెలంగాణా లో మాత్రం కొత్త కప్పులు సందడి చేస్తున్నాయి.మహబూబాబాద్ జిల్లాలో అరుదైన పసుపు రంగు కప్పలు దర్శనమిచ్చాయి. మరిపెడ మండలం ఎల్లంపేట ష్టేజి తండాలో పసుపు రంగు కప్పలు కనిపించాయి. వర్షాలు కురవడంతో వర్షపు నీటిలో ఈ పసుపు రంగు కప్పలు చేరాయి.

అయితే ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడకపోవడంతో స్థానికులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. అయితే, ఈ పసుపు రంగు కప్పలను చూసిన గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. నిజానికి ఇవి సాధారణ కప్పలే. వీటిని బుల్‌ఫ్రాగ్స్ అంటారని నిపుణులు చెబుతున్నారు..ఖాకీ, ఆలివ్ గ్రీన్ కలర్‌లో ఉండే ఈ కప్పలు సడెన్‌గా ముదురు పసుపురంగులో మారతాయి. ఇలా పసుపు రంగులో మారేవన్నీ మగ కప్పలేనట. ఆడ కప్పలను ఆకర్షించడానికి రంగును మార్చుకుంటాయట. ఈ విషయం తెలియక అక్కడ ప్రజలు భయ పడుతున్నారు..

టెర్రిబిల్లిస్ కప్పలు కూడా పసుపు వర్ణంలోనే ఉంటాయి. కొలంబియా అడవుల్లో కనిపించే ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్స్ అని కూడా పిలుస్తారు. ఈ కప్పలే ఇప్పుడు మన దేశంలో కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదంటున్నారు నిపుణులు. గడిచిన కొన్నేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాకాలం ప్రారంభంలో ఈ కప్పలు కనిపించాయి.గతంలో కర్నూల్ లో కూడా ఇలాంటి కప్పలే దర్శనమిచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news