ఆ అగ్నిపర్వతంలో జనాలు స్నానాలు చేస్తారు…!!

-

పులిహోరలో పులి ఉండదు..పకోడిలో కోడి ఉండదు.. అలా కొన్ని అగ్ని పర్వాతాల్లో అగ్ని కూడా ఉండదు. ఇప్పుడు చెప్పుకోబోయే అగ్నిపర్వతంలో అగ్నికాదు.. అంతే మట్టే ఉంటుంది. ఇక్కడికి వెళ్లిన వారంతా ఆ బురదలో పడి డొల్లుతారట. ఈ క్రేజీ పర్వతం గురించి పూర్తి వివరాలు మీకోసం..!

అజర్‌బైజాన్‌లోని గరదాగ్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్ట్ 11న ఓ మట్టి అగ్నిపర్వతం బద్దలైంది. చాలా మట్టి గాలిలోకి లేచి భయంకరంగా కనిపించిందట. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇటువంటి మట్టి అగ్నిపర్వతాలను మట్టి గోపురాలు అని పిలుస్తారు. వేడి బురదతో పాటు నీరు, వాయువు మట్టి అగ్నిపర్వతాల నుంచి బయటకు వస్తుంటాయి. నిజానికి ఇవి అగ్నిపర్వతాలు కావు. అయితే అగ్నిపర్వతాల మాదిరి పేలడం, లోపలనుంచి బురద లావాలా ప్రవహించడం కారణంగా దీనిని అగ్నిపర్వతం అని పిలుస్తుంటారు.

ఇటువంటి మట్టి అగ్నిపర్వతాలు ఇదొక్కటే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అండమాన్-నికోబార్ ద్వీపంలో కూడా ఇవి కనిపిస్తాయి. ఈ మట్టి అగ్నిపర్వతాల్లో 86 శాతం మీథేన్ వాయువు, కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్-నత్రజని ఉంటాయి. ఇటువంటి మట్టి అగ్నిపర్వతాలు ప్రపంచంలో అనేక దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అండమాన్-నికోబార్ ద్వీపంలో ఇవి కనిపిస్తాయి.

అజర్‌బైజాన్ దానికి అనుకుని ఉన్న కాస్పియన్ తీరంలో ఇటువంటి అగ్నిపర్వతాలు అధికంగా కనిపిస్తాయని సమాచారం.. 400 కంటే ఎక్కువ మట్టి అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయట. చాలా దేశాల్లో ఈ మట్టి అగ్నిపర్వతాల్లో స్నానాలు చేస్తుంటారు. ఈ మట్టి అగ్నిపర్వతాల్లో 86 శాతం మీథేన్ వాయువు, కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్-నత్రజని ఉంటాయి.

ఆస్ట్రేలియా మినహా ప్రతి ఖండంలోనూ, అంటార్కిటికాలో కూడా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అగ్నిపర్వతం యొక్క ప్రధాన స్థానాలు ప్రధానంగా భూకంప క్రియాశీల మండలాలు. భూమి యొక్క క్రస్ట్‌లోని లోపాలు, టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్లలో ఉన్నాయి. చురుకైన అగ్నిపర్వతాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి భూకంపాలకు ఎక్కువగా గురవుతాయని, ఇక్కడ చాలా భూగర్భ కదలికలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news