కొటేరు ముక్కు ఉన్నవాళ్లు అత్యంత శక్తివంతులట..!

కొటేరు ముక్కు ఉన్న వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. పొడవైన ముక్కులోనే అందమైన ముక్కు వీళ్లది. చూడగానే ఆకట్టుకునే ముక్కు వీళ్లది. వీళ్లు ఏ పని చేయాలన్నా ఆవేశపడరు. తొందరపడరు. దానికి సంబంధించి సమగ్రంగా ఆలోచన చేస్తారు.

కొటేరు ముక్కు అంటే ఏంది.. అని షాక్ కాకండి. మనుషుల్లోనూ ముక్కులలో చాలా రకాలు ఉంటాయట. కొందరికి నడ్డి ముక్కు ఉంటుంది. మరి కొందరికి పొడవాటి ముక్కు ఉంటుంది. ఇంకొందరికి కొటేరు ముక్కు ఉంటుంది అన్నమాట. కొటేరు ముక్కు ఉన్నవాళ్ల ముక్కు ఎలా ఉంటుందంటే ఉదాహరణకు మన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ముక్కులా ఉంటుందన్నమాట. ఆ ముక్కు ఉన్నవాళ్ల మనస్తత్వం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది.

ఎట్టెట్టా.. ముక్కును చూసి.. ఆ వ్యక్తి మనస్తత్వం చెప్పేయొచ్చా? అని అంటారా.. ఎస్.. ముక్కు చూసి మనిషి గురించి అంచనా వేయొచ్చంట. ఎందుకంటే మనిషి ముక్కు ఎన్నటికీ మారదు. అది అలాగే ఉంటుంది. సో.. స్థిరంగా ఉండే మనిషి ముక్కును బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని శాస్త్రం చెబుతోందట.

కొటేరు ముక్కు ఉన్న వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. పొడవైన ముక్కులోనే అందమైన ముక్కు వీళ్లది. చూడగానే ఆకట్టుకునే ముక్కు వీళ్లది. వీళ్లు ఏ పని చేయాలన్నా ఆవేశపడరు. తొందరపడరు. దానికి సంబంధించి సమగ్రంగా ఆలోచన చేస్తారు. అంతేకాదు.. అందరిలో ఒకరిలా ఉండరు వీళ్లు. వీళ్లకు వీళ్లే భిన్నంగా ఉంటారు. భిన్నంగా పనులను చేస్తుంటారు. వీళ్ల లక్ష్యాలు కూడా ఉన్నతంగా ఉంటాయి.

కొటేరు ముక్కు ఉన్నవాళ్ల ముక్కు నుదుటి నుంచి పై పెదవి వరకు వచ్చి ఆగుతుంది. ముక్కును ముందు నుంచి చూసినా.. ముఖం మీది నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది. పక్క నుంచి చూస్తే మాత్రం మరోలా కనిపిస్తుంది. కొటేరు ముక్కు కొనభాగం కొనదేలి కనిపిస్తుంది. ఇలా.. ఒక్కొక్కరిలో ఒక్కో రకం ముక్కు ఉంటుంది. అయితే.. అందరి కన్నా.. కొటేరు ముక్కు ఉన్నవాళ్లు మాత్రం చాలా ఉన్నతంగా జీవిస్తారు.

ప్రపంచంలోని అన్ని విషయాలను వీళ్లు తెలుసుకోవాలనుకుంటారు. ఇతరులతో అనవసరంగా మాటలు కలపరు. తొందరపడి వేరేవాళ్లను పల్లెత్తు మాట అనరు. ఏ పనిలో అయినా నాణ్యతను కోరుకుంటారు. అందుకే ఈ ముక్కు ఉన్నవాళ్లను అత్యంత శక్తివంతులని అంటారు.