డెక్కన్ స్పోర్ట్స్ మాల్ కూల్చివేతకు అనుమతి

సికింద్రాబాద్ లోని డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బిల్డింగ్ లో గంటల తరబడి మంటలు చెలరేగడంతో స్లాబ్ లు క్రాస్ అయినట్లు గుర్తించారు అధికారులు. కింది ఫ్లోర్ ఎక్కువగా డ్యామేజ్ అయిందని, రిపేర్లకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బల్దియాకు రిపోర్ట్ ఇచ్చారు. అయితే భవనంలో ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయేమోనని డిఆర్ఎస్, ఫైర్ సిబ్బంది ఆదివారం పరిశీలించారు.

ఎలాంటి మృతదేహాలు కనిపించలేదు. దీంతో డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీనికోసం రోబోటిక్ టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించారు. భవనం ముందు భాగంలో పై ఫ్లోర్ నుంచి కూల్చివేతకు ప్లాన్ రూపొందించారు.