కాసేపు మనోభావాలు, కాస్త అతి పక్కన పెట్టి ఒక విధంగా ఆలోచిద్దాం… ఈ రోజుల్లో ఎవరైనా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయికి ఎన్నో లక్షణాలు ఉండాలి. అబ్బాయికి ఆస్తి పాస్తులు ఉండాలి, అబ్బాయికి అందం ఉండాలి. లక్షల జీతం ఉండాలి, కోట్ల ఆస్తి ఉండాలి. అన్నీ ఉండాలి… అన్నీ ఉంటేనే సాధ్యమవుతుంది. ఏది తక్కువ అయినా సరే అబ్బాయిని వదిలేస్తారు అమ్మాయిలు.
కాని ఒక అమ్మాయి వికలాంగుడు అని తెలిసినా సరే ప్రేమించి ఏరి కోరి పెళ్లి చేసుకుంది. ఒక జాతీయ మీడియా కథనం ఆధారంగా… కేరళ త్రిచూర్ జిల్లాలోని తాజేఘాట్‌కు చెందిన ప్రణవ్‌కి… ఆరేళ్ల కిందట విద్యార్ధిగా ఉన్నప్పుడు ప్రమాదం జరగడంతో ఆ ప్రమాదంలో తుంటి కింద భాగం దెబ్బతిని నడవలేని పరిస్థితి వచ్చింది. చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. ప్రతి దానికీ ఇతరుల సాయంపై ఆధారపడాల్సి వస్తోంది.
అయితే అతనిలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ఆలయాలలో జరిగే ఉత్సవాలకు హాజరయ్యారు ఆయన. అక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే వారు. వెంటనే ఆ వీడియో లు చూసిన తిరువనంతపురానికి చెందిన షహానా అనే అమ్మాయి… అతనితో మాట్లాడింది. అసలు విషయం చెప్పింది. నాకు నువ్వంటే చాలా ఇష్టమని, మా ఇంట్లో ఒప్పిస్తాను పెళ్లి చేసుకుందాం అని అడిగింది. దానికి ఆ వ్యక్తి అసలు అంగీకరించలేదు.
అమ్మాయి అందంగా ఉండటంతో నీకు నేను వద్దని చెప్పేసాడు. వెంటనే ఆమె మరో మాట మాట్లాడనీయకుండా ఇంట్లో ఒప్పించింది. పెళ్లి చేసుకుంది. గత నెల మూడున ఇద్దరూ వివాహ బంధం తో ఒకటి అయ్యారు. కుటుంబ సభ్యులు వద్దని వారించినా సరే ఆ అమ్మాయి మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.