మసాజ్ చేస్తే..ఎంతటి నొప్పులునా అలా చేత్తో తీసేసినట్లే పోతాయ్. ఆ క్షణానికి భలే హాయిగా ఉంటుంది కదూ. తలనొప్పికి హెడ్ మసాజ్, ఒంటినొప్పులకు బాడీమసాజ్ ఇలా వివిధరకాల నొప్పులకు ప్రత్యేకమైన మసాజ్‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయో మసాజ్ కాస్త తేడానే. మసాజ్‌కు ఎక్కడైనా ఆయిల్స్ వాడతారు. కానీ ఇక్కడ బోర్లా పడుకోపెట్టి పాములను వదులుతారు. ఈ వెరైటీ మసాజ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
మనుషులను అమాంతం మింగేసి.. కడుపునింపుకొనే కొండచిలువలను మసాజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా పాములు శరీరంపై వేస్తే.. చక్కని మసాజ్ లభిస్తుందని ఆ స్పా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మసాజ్ సెంటర్ ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది.ఇండోనేషియాలో 2009లో ఈ ‘స్పా’ స్టాట్ చేశారు. ఈ స్పా లో మసాజ్ చేయడానికి కొండ చిలువలను ఉపయోగించటం విశేషం. అలా మసాజ్ చేయించుకోవాలంటే వంటి పై నూలు పోగు కూడా ఉంచుకోకూడదు. మాసాజ్ చేయించుకోవడం కోసం బోర్లాపడుకుని.. వంటి మీద బట్టలు తీసివేస్తే.. అప్పుడు కొండచిలువలను వీపుపై వదులుతారు. అలా ఆ పాములు శరీరంపై మెత్తగా కదలడం వల్ల మంచి అనుభూతికి లోనవ్వుతారని స్పా నిర్వాహకులు చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ పాముల మసాజ్ వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది అని చెబుతున్నారు. స్నేక్ మసాజ్” ఒత్తిడిని దూరం చేస్తుందట. శరీరం ఇతర రసాయనాలతోపాటు ఆడ్రినలిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచుతుంది. అంతేకాదు శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తుందట.
చెప్పడానికి బానే ఉంది..కానీ వాళ్లకు భయం లేదా..పోయి పోయి పాములను మీద వేసుకుంటున్నారు.అది కూడా బట్టలు లేకుండా..అసలు ఈ సీన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.. అక్కడ ప్రజలకు ఆ భయం ఉండదు.. ఎందుకంటే జకార్తాలోని ప్రజలెప్పుడూ పాములతోనే సావాసం చేస్తారు. పాములను నియంత్రించడంలో వాళ్లు మంచి నేర్పరులు.. పైగా వాటిని స్నాక్స్ గా చేసుకొని ఆహారంగా తీసుకొంటారు కూడా..ఇంక భయమెందుకు ఉంటుంది. ఈ పాముల స్పాకు జనాల తాకిడి ఎక్కువ అవడంతో విపరీతమైన డిమాండ్ పెరుగుతుందట.
-Triveni Buskarwothu