లడఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా ఆర్మీ పాల్పడిన దురాగతానికి 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనపై యావత్ దేశం స్పందిస్తోంది. చైనాకు వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్నారు. ఆ దేశ వస్తువులను నిషేధించాలని అంటున్నారు. అయితే ఇదే పోరులో భారత్‌కు తైవాన్ అండగా నిలిచింది. చైనా డ్రాగన్‌ను చంపేయాల్సిందే.. అని వారు ఏకంగా ఓ కార్టూన్‌ను వేశారు. ఆ కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశంలోని హిందువులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది హిందువులకు శ్రీరాముడు ఆరాధ్య దైవం. ఇక చైనా అంటే వారిని డ్రాగన్ దేశంగా పిలుస్తారు. ఈ క్రమంలోనే శ్రీరాముడు బాణంతో చైనా డ్రాగన్‌ను చంపుతున్నట్లుగా ఓ కార్టూన్‌ను తైవాన్ వాసి హోసైలెయ్ గీశాడు. అందుకు అతను తన భారత స్నేహితుడి సహకారం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఆ కార్టూన్‌ను అతను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాగా దీనికి ఇప్పటికే 21వేలకు పైగా లైక్‌లు, 7వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ కార్టూన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
印度朋友連中印大戰精美poster都整好了https://t.co/pdU9nS6Zra
– 分享自 LIHKG 討論區 pic.twitter.com/ttl7XLPsmi— HoSaiLei🇺🇸🇬🇧🇧🇪🇯🇵🇮🇳 (@hkbhkese) June 16, 2020
కాగా ఆ కార్టూన్‌లో We Conquer, We Kill అనే క్యాప్షన్‌ను పెట్టారు. దీంతో ఈ కార్టూన్ ఇటు భారతీయులనే కాదు, అటు తైవానీయులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. నిజానికి తైవాన్ భారత్‌కు అత్యంత దగ్గరైన మిత్రదేశం. చైనాకు, తైవాన్‌కు గత కొన్నేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. అందులో భాగంగానే ఆ దేశం భారత్‌కు దగ్గరైంది. ఇక కరోనా సమయంలో 10 లక్షల మాస్కులను తైవాన్ భారత్‌కు అందజేసింది. అలాగే తైవాన్‌లో ఆ దేశ పౌరుల ఉద్యమాలకు భారతీయులు కూడా మద్దతు ఇస్తున్నారు. దీంతో ఇరు దేశాల పౌరులు కలిసి ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామమని అందరూ అంటున్నారు.
I, Taiwanese, stand with India.#IndiaChinaFaceOff #IndianArmyOurPride pic.twitter.com/QdaTGMzQKS
— Ping (@PingloveTaiwan) June 17, 2020
ఇక మిల్క్ టీ అలయన్స్ పేరిట మరో కార్టూన్‌ను కూడా తైవానీయులు వైరల్ చేస్తున్నారు. మేం తైవానీయులం, భారత్‌కు మద్దతుగా ఉంటున్నాం.. అని కామెంట్లు పెడుతూ ఆ కార్టూన్‌ను వైరల్ చేస్తున్నారు. అందులో మిల్క్ టీ అలయెన్స్ పేరిట భారత్, తైవాన్‌తోపాటు పలు ఆసియా దేశాల జెండాలు, నాయకులు, టీ తాగుతున్నట్లు కప్పులతో చీర్స్ తదితర చిత్రాలు ఉన్నాయి. చైనాలో తప్ప దాదాపుగా మిగిలిన అన్ని దేశాల్లోనూ పాలతో టీని తయారు చేసుకుని తాగుతారు. అందుకనే మిల్క్ టీ అలయెన్స్ అని పేరు పెట్టి తైవానీయులు భారత్‌కు అండగా ఉన్నామని చెబుతున్నారు.