అక్కడ భూగర్భం నుంచి వింత శబ్దాలు..జనాలు ఏమంటున్నారంటే?

-

కళ్లతో చూస్తే గాని నమ్మలేని కొన్ని వింతలను వింటున్నాము.కొన్ని వింతలు జనాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం ఆలోచనలో పడేస్తున్నాయి.. అటువంటి వింతల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి.కొన్నిటికి ఆది అంతం లేని మిస్టరీగా మిగిలాయి..మరి కొన్ని అద్భుతాలను సృష్టించాయి..ఇక విషయానికొస్తే..అలాంటి వింత ఒకటి మహారాష్ట్రలో వెలుగు చూసింది.ఓ భూగర్భం నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అసలు ఆ శబ్దాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

మహారాష్ట్రలోని ఒక గ్రామంలో కొన్ని రోజులుగా వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలు ఆ ఊరి వాళ్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మహారాష్ట్ర, లాతూర్ జిల్లా, హసోరి గ్రామంలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 6 నుంచి భూగర్భం నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. వింతగా వినిపిస్తున్న శబ్దాలతో హసోరి గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నరు. శబ్దాలు ఎలా వస్తున్నాయో అర్థం కాక భయపడుతున్నారు. దీంతో అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టారు. జిల్లా అధికారులు ఈ శబ్దాలను పరిశీలించి అసలు విషయం తేల్చాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు.

ఈ మేరకు ఉన్నతాధికారుల సూచన మేరకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నెటిజమ్‌కు చెందిన నిపుణులు ఆ శబ్దాలను గమనించడం కోసం అక్కడికి వెళ్లారు..అతి త్వరలోనే ఈ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నారు.గ్రామస్తులు ఈ విషయంలో భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ గ్రామం కిలారి అనే చిన్న పట్టణానికి చాలా దగ్గరగా ఉంది. కిలారి ప్రాంతంలో 1993లో భారీ భూకంపం సంభవించి 9,700 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్నుంచి ఈ ప్రాంతంలో భూకంపం ఇప్పటివరకు రాలేదని అంటున్నారు.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వింత శబ్దాలు వినిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news