మహిళల్లో తీవ్ర ఒత్తిడి.. కారణాలు.. అధిగమించే దారులు..

-

మహిళలు మల్టీ టాస్కింగ్ చేయడంలో చాలా ఎక్స్ పర్ట్. మగవారు మల్టీ టాస్కింగ్ చేయలేరు. ఒక పని చేస్తూ మరో పని గురించి ఆలోచించడం మహిళలకే ప్రత్యేకం. అందులో పిల్లల్ని పెంచుతూ, ఉద్యోగంం చేయగలుగుతున్నారు. ఐతే కొన్ని విషయాల వల్ల మహిళల్లో తీవ్ర ఒత్తిడి కలుగుతుంది. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. దానివల్ల నిద్రలేకపోవడం, మూడ్ మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన అలసట, జుట్టు ఊడిపోవడం, చర్మ సమస్యలు, వయసు పెరుగుతున్నట్టు కనిపించడం మొదలగునవి ఇబ్బంది పెడుతుంటాయి.

వయసు పెరుగుతున్నట్టు కనిపించడం అంటే చర్మంపీ ముడుతలు ఏర్పడడం మాత్రమే కాదు. ఎముకలు బలహీనంగా మారిపోవడం, శరీరం బలహీనంగా మారడం వంటి సమస్యలు కలుగుతాయి. ఐతే అధిక ఒత్తిడిని దూరం చేసుకుని, జీవితాన్ని హాయిగా సాఫీగా సాగించాలంటే ఏం చేయాలో చూద్దాం.

ఎక్సర్ సైజ్ చేయడం వల్ల మెదడుకి ఆక్సిజన్ చేరి అనారోగ్యాలని దరి చేరనివ్వకుండా చేస్తుంది. ఫిజికల్ ఆక్టివిటీ అనగానే జిమ్ కి వెళ్ళడమే అనుకుంటారు చాలా మంది. ఒక పది నిమిషాలు నడక కావచ్చు. యోగా, ధ్యానం కావచ్చు.

అలాగే మీకు ఒత్తిడి కలిగించే విషయం గురించి తెలుసుకోండి. దేనివల్ల మీ మీద బరువు పెరుగుతుందో తెలుసుకుని, బాధ్యతలను తగ్గించుకుంటే మంచిది.

సరైన నిద్ర, సరైన ఆహారం తీసుకుంటే ఒత్తిడి దూరం అవుతుంది. నిద్ర సరిగ్గా లేకపోయినా, ఆహారం సరైనది తీసుకోకపోయినా చిరాకు కలిగి అది ఒత్తిడికి దారి తీస్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి హాయిగా, సాఫీగా జీవనాన్ని కొనసాగించండీ.

Read more RELATED
Recommended to you

Latest news