సన్‌ చార్జ్‌ వాటర్‌తో ఆరోగ్యమే కాదు.. అందం కూడా..ఇలా చేసేయండి..!

-

ఎండ వేడికి.. అందరికి చిర్రెత్తుత్తుంది కానీ.. అసలు ఈ భూమి మీద.. అత్యంత ముఖ్యమైన మూలకాలలో ఒకటి సూర్యుని వేడి. సూర్యరశ్మి చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేయగలదని ఆయుర్వేద నిపుణులు అంటుంటారు. సూర్యుడి నుంచి ఛార్జ్ చేసిన నీరు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ నీటిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయట.. ఇవి ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి.


సన్ ఛార్జ్ వాటర్ తాగడం వల్ల మీరు రోజంతా శక్తిగా ఉంటారు.

.దద్దుర్లు, ఎరుపు వంటి చర్మ సమస్యలను దూరం చేయడంలో, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సాయపడుతుంది.
సన్ ఛార్జ్డ్ వాటర్ తాగడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నీటితో కళ్ళను కడగడం వల్ల ఉపశమనం ఉంటుంది. ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ సమస్యలు దూరం చేస్తాయి.
సన్ ఛార్జ్డ్ వాటర్ పూర్తిగా సహజమైనది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు అనేకం ఉన్నాయి.
అయితే ఇదివరకే మీరు ఏదైనా ఆరోగ్య సమస్యని కలిగి ఉంటే ఈ నీటిని తాగే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

సన్ ఛార్జ్డ్ వాటర్ ఎలా తయారు చేస్తారు?

ఒక గాజు బాటిల్ తీసుకోండి. అందులో నీరు నింపి 8 గంటల పాటు ఎండలో ఉంచాలి. ఇలా రోజూ చేయండి.
అయితే ఈ నీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దూరమవుతాయి.
మీరు రోజూ తాగే నీటిని బట్టి ఎన్ని బాటిల్స్ అవసరమైతే అన్ని బాటిల్స్ ఎండలో పెట్టి తాగాలి.
దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు. చర్మం కూడా మెరుస్తుంది. సాధారణంగానే విటమిన్ డి ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి నీటిని ఇలా ఎండలో ఉంచి తాగడం వల్ల ఆ నీటికి విటమిన్ డి తోడై మరిన్నీ ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నీటిలో పుదీనా, నిమ్మ ముక్కలు వేసి కూడా వాటిని తాగొచ్చు.
ఎండలో వేడి నీళ్లు ఏం తాగుతాంరా బాబు అనుకుంటారేమో.. ఎండలోంచి తీసిన వెంటనే తాగక్కర్లేదు. నీడలో పెట్టి. చల్లబడ్డాకే తాగాలి. అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news