అందరిదీ ఒక పిచ్చి..ఈమెది మరో పిచ్చి..77 లక్షలు ఖర్చు చేసి..

ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది.. ఆ పిచ్చి కోసం ఎన్నెన్నో చేస్తున్నారు..కొందరి థ్రిల్ పేరుతో ప్రాణాలను కూడా పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి..మరో విధంగా చెప్పాలంటే భయానకంగా కూడా ఉంటుంది. అసలు ఊహకు కూడా అందదు..తాజాగా ఓ వ్యక్తి కుక్కలాగా మారాలని అనుకున్నాడు.. అందుకోసం ఏకంగా 12 లక్షలను ఖర్చు చేశారు..చివరికి అతని కోరిక మాత్రం తీరింది.ఇకపోతే ఓ అమ్మాయి అచ్చం బొమ్మలాగా కనపడాలని ఏకంగా తన శరీరంలోని ఎముకలను తీయించిందట..వామ్మో అంత రిస్క్ అవసరమా అని మనము అనుకున్న,ఆమెకు మాత్రం కేవలం అది సరదా అంటుంది.

ఆ బొమ్మ చిన్నదాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఆమె పేరు పిక్సీ ఫాక్స్. స్వీడన్ కు చెందిన పిక్సీ ఫాక్స్ కు కార్టూన్లలో కనిపించే అమ్మాయిల లాంటి నడుము కావాలన్నది కోరిక. దీనివల్ల నటిగా అవకాశాలు వస్తాయనేది ఆమె నమ్మకం. అంతే.. అలాంటి సన్నని నడుము కోసం ఏకంగా రూ.77లక్షలు ఖర్చు చేసింది. వెన్నెముకకు రెండువైపులా ఉండే 6 ఎముకలను తొలగించుకుంది. దీంతో ఆమె నడుము 14 అంగుళాలకు చేరింది. తనను తాను లివింగ్ కార్టూన్ గా ప్రకటించుకున్న పిక్సీ.. కనురెప్పలు, ముక్కు, వక్షోజాలకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. 2010లో తొలి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.

యానిమేషన్ కార్టూన్లలో అమ్మాయి బొమ్మలకు నడుం ఉందా లేదా అన్నట్లు ఉంటాయి. అలాంటివి చూస్తూ పెరిగిన పిక్సీ… తనకు కూడా అలాంటి నడుం కావాలని అనుకుంది.కార్టూన్ బొమ్మలాగే ఉండాలనుకున్న పిక్సీ.. ఇప్పుడు అలాగే కనిపిస్తోంది. ఇందుకోసం ఆమె సర్జరీలు చేయించుకుంది. వాటి కోసం అక్షరాల రూ.77 లక్షల 60వేలు ఖర్చుపెట్టింది..వెన్నెముక కింద ఉన్న 6 ఎముకలను తొలగించుకుంది..తన నడుము 14 అంగుళాలకు మారేలా చేసుకుంది. ప్రస్తుతం 32 ఏళ్ల పిక్సీని ప్రపంచం లివింగ్ కార్టూన్‌గా గుర్తిస్తోంది. అదే పేరుతో ఆమె సెలబ్రిటీ హోదా పొందుతోంది..నడుం కోసం ఇలాంటి పని చేయడం పై అందరు షాక్ అవుతున్నారు..ఏంటో ఎవడి పిచ్చి వాడికి ఆనందం..