నగంరలో శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా..ఎక్కడుందంటే..!

-

మనిషికి చివరి మజిలి శ్మశానమే..మహాప్రస్తానంతో అంతరించిపోయే మనిషి జీవితం శ్మశానానికి పయనమవుతుంది. ప్రతి ఊర్లోను శ్మశానాలు కచ్చితంగా ఉంటాయి. ఆ ఊరిని బట్టి రెండు లేదా మూడు ఎకరాల్లో ఉంటుంటాయి. కానీ ఆ దేశంలో వేల ఎకరాల్లో ఒక శ్మశానవాటిక ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక అది. అది ఎక్కడుంది, ఎందుకు అన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసుకుందాం..!

రోజుకు 200లకు పైగా ఖననం

ఇరాక్ లో‌ దాదాపు 1,485 ఎకరాల్లో ఉంటుందీ శ్మశానం. ఇప్పటివరకూ 50 లక్షల మృతదేహాలను ఖననం చేసిన ఈ శ్మశాన వాటిక చూపరులకు ఓ మహానగరాన్ని తలపించేలా ఉంటుంది. దీనిని ‘వాడీ ఉస్‌ సలామ్‌’ అని పిలుస్తారు. దీనికి ‘వ్యాలీ ఆఫ్‌ పీస్‌’ అనే మరోపేరు కూడా ఉంది. రోజుకు కనీసం రెండు వందలకుపైగా మృతదేహాలను ఖననం చేస్తారట. షియా ముస్లీంలకు ఈ శ్మశానం చాలా ప్రత్యేకమైనది. ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని, వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని వాళ్లు కోరుకుంటారట.

ఆ యుద్ధకాలంలో అధిక సంఖ్యలో..

ఇది చాలా పురాతనమైన శ్మశానవాటిక అనే చెప్పాలి.. గత 1400 ఏళ్ల నుంచి ఈ శ్మశానంలో ఖననాలు జరుగుతున్నాయి. 18వ శతాబ్ధంలో జరిగిన ఇరాన్‌ – ఇరాక్‌ యుద్ధంలో మరణించిన వారిని ఇక్కడ ఖననం చేయడంతో ఒక్కసారిగా సమాధుల సంఖ్య పెరిగింది. ఇరాన్‌తో యుద్ధ సమయంలో రోజుకు 250 మృతాదేహాలను ఖననం చేసేవారట. 19వ శాతాబ్ధంలో జరిగిన గల్ఫ్‌ యుద్ధ సమయంలో ఈ శ్మశానవాటికలో ఉగ్రవాదులు దాగడం మూలంగా అనేక సమాధులను ఇరాక్‌ సైన్యం పడగొట్టింది. వందల వేల మృతదేహాలను ఈ యుద్ధ కాలంలో ఖననం చేశారట.

అసలు రోజుకు అన్ని వందల మృతదేహాలను ఖననం చేస్తున్నారంటే..అటువైపు వెళ్లడానికి కూడా చాలమంది భయపడతారు. కనుచూపుమేర సమాధులే ఉంటే ఆ విజువల్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఏవో ఆత్మలు గోషిస్తున్నట్లు అనిపిస్తుంది కూడా. ఇన్ని వేల సమాధులు ఇంత పెద్ద మహానగరంగా ఉండటం వల్లే ఈ సమాధికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ సమాధికి సంబంధించి కొన్ని వీడియోలు ఉన్నాయి. మీరు చూడాలి అనుకుంటే సమాధిపేరుతో వెతికితే వీడియోలను చూసే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news