స్కూల్‌లో 30 మంది స్టూడెంట్స్‌ జుట్టు కత్తిరించిన టీచర్‌

-

ఈ మధ్య కొంతమంది టీచర్లు.. పాఠాలు చెప్పడం కంటే.. ఎక్కువగా పనిష్మెంట్‌ ఇవ్వడంపైనే శ్రద్ధపెడుతున్నారు. మీకు ఇలానే అనిపిస్తుందా..?అసోంలో ఓ స్కూల్‌లో చదువుతున్న 30మంది విద్యార్ధుల జుట్టు కత్తిరించించారు ఓ టీచర్. ఉదయం ప్రార్ధన సమయంలో లైన్‌లో నిల్చున్న స్టూడెంట్స్‌ వెంట్రుకలు పొడవుగా ఉన్నాయనే కారణంతో జుట్టు కత్తిరించారు.. క్రమశిక్షణ పాటించని కారణంగా పనిష్మెంట్ అంటూ ఈ పని చేశారట.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. స్కూల్ టీచర్‌ల తీరుపై స్టూడెంట్స్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. టీచర్ స్టూడెంట్స్‌కి విధించిన శిక్షను స్కూల్ యాజమాన్యం సమర్ధించుకుంటోంది. తప్పేం లేదు అంటుంది..!

అసోంలోని మజూలి జిల్లాలోని స్కూల్‌లో 30మంది విద్యార్ధుల జుట్టు కత్తించారు టీచర్. స్కూల్‌ డిసిప్లేన్‌లో భాగంగా జుట్టు పొడవుగా పెంచుకోవద్దని విద్యార్ధులకు టీచర్లు చెప్పారు. అయినప్పటికి విద్యార్ధులు ఆ రూల్స్‌ని బ్రేక్ చేసి..క్రాఫ్ పెంచుకోవడంతో కోపంతో టీచర్‌ ఇలా చేశారట.. స్కూల్‌లో అందరి ముందు తమ జుట్టు కత్తిరించడంతో అవమానంగా ఫీలైన విద్యార్ధులు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పారు.

తమ పిల్లల జుట్టు కత్తిరించడంతో విద్యార్ధుల పేరెంట్స్ స్కూల్ దగ్గరకు వచ్చి ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే ..క్రమశిక్ష తప్పడం వల్లే చేశామని యాజమాన్యం చెప్పుకొచ్చింది. దాంతో పేరెంట్స్ క్రమశిక్షణ నేర్పే పద్దతి ఇదేనా అంటూ స్కూల్ యాజమాన్నాన్ని నిలదీశారు. అయితే నిక్కీ అనే టీచర్‌పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా డిప్యూటీ కమిషనల్ కావేరి బి శర్మ విచారణకు ఆదేశించారు.

టీచర్‌ తీరుపై విమర్శలు..

జుట్టు కత్తిరించిన టీచర్ నిక్కీ మాత్రం తాను పొడవుగా ఉన్న జుట్టును మాత్రమే కట్ చేశానని ..వారిని అవమానించలేదని తెలిపింది. అంతే కాదు స్కూల్‌ రూల్స్‌ పాటించాను తప్ప తానేం తప్పు చేయలేదని సమర్దించుకుంది. దీనిపై పూర్తి విచారణ జరిపి నివేదికను సమర్పించాలని డిప్యుటీ కమిషనర్ అధికారుల్ని ఆదేశించారు.

పాఠాలు చెప్పమంటే పాఠశాలల్లో పనిష్మెంట్‌ల పేరుతో విద్యార్ధుల్ని వారి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నారనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మొన్నటి మొన్న స్కూల్‌లో మాతృభాష మాట్లాడినందుకు రూ.250 జరిమానా వేశారు. మన దగ్గర కూడా కార్పోరేట్‌ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మాట్లాడకపోతే ఇలా ఫైన్‌లు వేస్తున్నారు. రాను రాను ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ ఇంత అధ్వానంగా ఎందుకు తయారవుతుందో..?అని చాలా మంది నిట్టూరుస్తున్నారు.!

Read more RELATED
Recommended to you

Latest news