అందానికే అందం ఆడవాళ్ళు. ప్రకృతిలో ఉన్న అందమైన వాటన్నింటిలో ఆడవాళ్ళదే పైచేయి. అందుకే ఆడవాళ్ళ కోసం యుద్ధాలే జరిగాయని చెబుతారు. అదంతా పక్కన పెడితే మగాళ్ళని పెద్దగా ఆకర్షించని ఆడవాళ్ళలోని కొన్ని లక్షణాలేంటో చూద్దాం. ఈ లక్షణాలు ఆడవాళ్ళలో కనిపిస్తే వారి నుండి దూరంగా ఉండడానికి మగవాళ్ళు ఇష్టపడతారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
మేకప్
వేసుకోవాల్సినంత వేసుకుంటే బానే ఉంటుంది. కానీ కొందరు వేసుకుంటే మాత్రం మరో మనిషిలా కనిపిస్తారు. కళ్ళకి, బొమ్మలకి, పెదాలకి, కనురెప్పలకి ఇలా మరో ఓవర్ గా మేకప్ చేసుకుంటే మగవాళ్ళు ఇష్టపడరు. అమ్మాయిలకి మగాళ్ళూ అట్రాక్ట్ కాకపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి.
పొడవుగా ఉండే గోర్లు..
అన్ని వేళ్ళకి గోర్లని పెంచుతూ షార్ప్ గా తయారు చేస్తూ, వాటికి నెయిల్ కలర్ అద్దే వాళ్ళకి అట్రాక్ట్ అవరు.
జుట్టు మరీ ఓవర్ గా స్టైల్ గా ఉండడం
నెత్తిపై జుట్టు ఓవర్ స్టైలిష్ గా ఉంటే కూడా మగాళ్ళు పెద్దగా ఇష్టపడరు.
మరీ కాన్ఫిడెంట్ గా కనిపించడం
ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలని ఎవ్వరైనా ఇష్టపడతారు. కానీ అతి విశ్వసానికి ఆత్మవిశ్వాసానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటితే ఆడవాళ్ళపై ఆకర్షణ తగ్గిపోతుంది. మరో ఓవర్ కాన్ఫిడెంట్ గా కనిపించడం కూడా ఒకరకమైన కృత్రిమ చర్యలా అనిపించే అవకాశం ఉంది.
అటెన్షన్ కోరుకునే వారిని
అందరి దృష్టి తమ మీదే ఉండాలని, తన గురించే ఆలోచించాలని, మాటి మాటికీ తన గురించే చెబుతూ, మళ్లీ మళ్ళీ గుర్తుంచుకునేలా చేసేవాళ్ళకి మగవాళ్ళు ఆమద దూరంలో ఉంటారు.
ఐతే ఇలా అందరూ ఉంటారని కాదు. ఇలాంటి లక్షణాలున్న ఆడవాళ్ళకి మగవాళ్ళు పెద్దగా అట్రాక్ట్ అవలేరు.