ఇక ఆ వాహనాల రిజిస్ట్రేషన్‌ బంద్‌!

-

వాహనాల రిజిస్ట్రేషన్లపై కేంద్ర ప్రభుత్వం సరి కొత్త రూల్స్‌ తీసుకువస్తోంది. వెహికల్‌ రిజిస్ట్రేషన్‌ కు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దీనిపై ఒక డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై మోడీ సర్కార్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీని వల్ల ప్రభుత్వానికి చెందిన పాత వాహనాల రిజిస్ట్రేషన్‌ పనులు నిలిచిపోనున్నాయి.

పదిహేనేళ్లకుపైగా ఉపయోగిస్తున్న వాహనాల రిజిస్ట్రషన్‌ ఇక జరగదు. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఈ రూల్‌ అమలులోకి తీసుకువస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బస్సుల రిజిస్ట్రేషన్‌ కూడా ఆగిపోనున్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనా ఇక మనకు రోడ్డుపై కనిపించవు.

కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్‌కు సంబంధించి ప్రజల తమ అభిప్రాయాలు తెలియజేయాల్సింది కోరుతోంది. 30 రోజుల వరకు ప్రజలు, పరిశ్రమ సంబంధిత వర్గాలు ప్రభుత్వపు కొత్త రూల్‌పై వారి సలహాలు, సూచనలు అందించవచ్చు. తర్వాత మోడీ సర్కార్‌ ఈ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకువస్తుంది.

ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలు వేటికైతే 15 ఏళ్ల నిబంధన వర్తిస్తుంది. పదిహేను సంవత్సరాల తర్వాత ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్‌ ఉండదని స్పష్టం చేసింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఈ రూల్‌ అమలులోకి రానుందని ప్రజలు గమనించాలి. ఇదిలా ఉండగా పాత వాహనాలను సీఎన్‌జీ గా మార్చుకుంటే ప్రస్తుతం తిరిగేందుకు అనుమతులు లభిస్తున్నాయి. దీంతో కొంత మంది తమ వాహనాలను తమకు ఇష్టమైన వెహికల్‌ అయితే సీఎన్‌జీలోకి మార్చుకుంటున్నారు. ఈ వెసులుబాటు కూడా ప్రస్తుతం కొంతమంది వాహనదారులకు ఊరటనిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news