పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత రెండు మనసులు మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా దగ్గరవుతాయి. అయితే కొత్తగా పెళ్లయిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది భార్యాభర్తలు కొత్తగా పెళ్లి అయిన తర్వాత ఈ తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మరీ కొత్తగా పెళ్లైన జంట ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దాం.
భర్తకి లేదా భార్యకి ప్రాముఖ్యత ఇవ్వాలి:
సాధారణంగా పెళ్లికి ముందు స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత కూడా ఎక్కువసేపు స్నేహితులతో గడపడం వాళ్లతో బయటకు వెళ్లడం లాంటివి చేయకూడదు. తప్పనిసరిగా మీరు మీ స్నేహితులతో తగ్గించి మీ భర్త తో కానీ భార్య తో కలిసి సమయాన్ని గడపాలి. నేను అనుకోకుండా మీరు మేము అని అనుకోవాలి. ఈ విధంగా కనుక మీరు నడుచుకుంటే సమస్యలు రావు.
తప్పులు చెయ్యరు అని అనుకోండి:
మీ భర్త కానీ మీ భార్య కానీ తప్పులు చేయరు ఎప్పుడు తప్పులు చెయ్యరు అని అనుకోవద్దు. అందరం మనుషులమే. ఎప్పుడోకప్పుడు తప్పులు చేస్తూ ఉంటాము. నేర్చుకుని ఎదిగే కొద్దీ మార్చుకుంటూ ఉంటాము. అంతే అలానే చూడాలి మీరు కూడా.
స్నేహితులని కుటుంబ సభ్యుల్ని మర్చిపోకండి:
మీరు మీ యొక్క స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు కూడా సమయాన్ని ఇవ్వాలి. అయితే మీరు మీ స్నేహితులతో పాటు బయటికి వెళ్ళినప్పుడు మీ భార్య లేదా భర్త ని కూడా తీసుకు వెళ్ళండి. ఇలా కనుక సమయాన్ని గడిపారు అంటే బ్యాలెన్స్ గా ఉంటారు. అలానే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలతో నడుచుకుంటే ఏ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉండవు.