రోజుకో కొత్త విషయం తెలుసుకున్నా.. సంవత్సరం అయిపోయే సరికి బోలెడు విషయాలు తెలుస్తాయి.. మనం ఇలాంటివి డైలీ కొన్ని అందిస్తూనే ఉన్నాం.. ఇలాంటి విషయాలు తెలుసుకుంటే.. మీ నాలెడ్జ్ పెరగడంతో పాటు.. టైం పాస్ కూడా అవుతుంది. కొన్ని విషయాలు.. మనకు అరే నిజమా.. అట్లానా అనిపిస్తాయి..మన చుట్టూనే ఉంటాయి.. కానీ వాటి గురించి మనం ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. అలాంటి కొన్ని క్రేజీ కమ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం.. ఇంకెందుకు ఆలస్యం అవేంటో చూద్దామా.!
మద్యం తాగిన వాళ్లకు ఎవర్ని చూసినా..మరింత ఎక్కువ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందుకే మద్యం మత్తులో అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
డిన్నర్‌లో 15 శాతం కంటే తక్కువ టిప్ ఇచ్చేవారితో 40 శాతం మంది రెండోసారి డేట్‌కి వెళ్లట్లేదు. భలే ఫన్నీగా ఉంది కదూ..! ఇంతకీ మీరు ఎంత టిప్ ఇస్తారు..?
వారంలో ఓ రోజు బద్ధకంగా ఉంటే ఒత్తిడి, హైబీపీ, గుండెపోటు వంటివి తగ్గేందుకు వీలవుతుంది. అందుకే సండే రెస్ట్ డే అని చాలా కంపెనీలు ఆరోజు సెలువు ఇస్తాయి.
బ్రిటన్‌లో ప్రతి 40 కిలోమీటర్లకూ భాషలోని యాసలో మార్పు కనిపిస్తుంది.
అదేపనిగా కీడెంచి మేలెంచే వారు.. ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఎక్కువ.
ఈ రోజుల్లో గిఫ్ లు స్టికర్లు వాట్సప్ లో ఎలా విపరీతంగా పంచుకుంటున్నారు. యూట్యూబ్ యూఆర్ఎల్ www.youtube.com లో యూట్యూబ్ ముందు gif అని టైప్ చేసి ఎంటర్ కొడితే… సొంత గిఫ్‌లు తయారుచేసుకునే ఆప్షన్ వస్తుంది.
కొంతమంది ఎప్పుడు కావాలంటే అప్పుడు అలారంతో పనిలేకుండా కచ్చితంగా నిద్ర లేవగలరు. పాపం అది వారిలో టాలెంట్ కాదు.. దానికి అసలైన కారణం వారిలోని స్ట్రెస్ హార్మోనే. స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రశాంతంగా నిద్రకూడా పోలేరు.
చాలా మంది రాత్రిళ్లు 3:44 A.M కి నిద్ర లేస్తుంటారు. ఈసారి లేచినప్పుడు మీరు టైం చూడండి.
మీరు అనుకోకుండా సిస్టమ్ లో ఏదైనా ట్యాబ్ (tab) క్లోజ్ చేస్తే… CTRL + SHIFT + T నొక్కి దాన్ని రీ-ఓపెన్ చెయ్యవచ్చు.