పడకగది అవసరం లేకుండా శృంగారాన్ని మరింత ఆనందించడానికి కావాల్సిన టిప్స్. 

-

ఆకాశానికి అంతులేదు. శృంగారానికి హద్దులు లేవు. పోలిక తేడాగా ఉన్నా మాట మాత్రం నిజం. పడకగదిలో రహస్యంగా ఇరువురి శరీరాలు ఏకమైనపుడు కలిగే అనుభూతి ఆద్యంతం అనుభవించాలంటే పడకగది బయట ఎలా ఉంటున్నావన్నది చాలా ముఖ్యం. యంత్రాల మాదిరి ఇరువురి కోరికలు తీర్చుకోవడం ఒక్కటే ధ్యేయంగా ఉన్నప్పుడూ శృంగారాన్ని అపరిమితంగా ఆనందించలేరు. ప్రస్తుతం పడకగది అవసరం లేకుండా శృంగారాన్ని మంరింత ఎంజాయ్ చేయడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

 

relationships

అనుకోకుండా ముద్దు

ముద్దు పెట్టుకోవడం వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. అవి భౌతికంగా దగ్గర తనాన్ని మరింత కోరుకునేలా చేస్తాయి. అందుకే చాలా సడెన్ గా ముద్దు పెట్టుకోబోతున్నారని తెలియనంతగా ముద్దు పెట్టండి.

ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోండి

ఇద్దరు ఏకమవడం అంటే శరీరాలు కలవడం ఒక్కటే కాదు. అవతలి వారి మనసులోకి వెళ్ళాలి. నువ్వు నేను ఒకటే అనేంత భావన కలగాలంటే ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చోవాలి. చాలా మంది శృంగారంలో ఆనందం పొందలేకపోవడానికి ఇది కూడా ఓ కారణమే. ప్రేమ లేకుండా ఒకరి ఒళ్ళో మరొకరు కూర్చోవడం సాధ్యం కాదు.

వారానికి ఒకసారి డేట్ కి వెళ్ళండి

ఇలా చెప్పగానే మాకేం పనిలేదా అనవద్దు. డేట్ అనగానే ఎక్కడో కులు మనాలీ అనో, కాశ్మీర్ అనో అనుకోవద్దు. వారానికి ఒక్కసారి, కనీసం ఒక్కసారి కలిసి వంటచేసి, భోజనం చేసి, ఆ రోజంతా మీరిద్దరే గడిపేలా చూసుకోండి.

యాత్ర

కనీసం నెలకి ఒక్కసారైనా విహార యాత్రకి వెళ్ళకపోతే వారి జీవితంలో రొమాన్స్ లేనట్టే. కనీసం ఒక్క సినిమా లేదా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు ఇంకేదైనా ప్రోగ్రామ్.. ఇలా ఏదైనా కావచ్చు.

సర్ప్రైజ్

సర్ప్రైజ్ ఇస్తూ ఉండండి. అది అవతలి వారికి మంచి నమ్మకాన్ని ఇస్తుంది. దానివల్ల భౌతికంగా దగ్గరవ్వాలనే కాంక్ష పెరుగుతుంది. అప్పుడు శృంగారం మరింత ఆనందాన్ని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news