తోడేలులా కనిపించేందుకు రూ. 18 లక్షలు ఖర్చుపెట్టిన జపాన్‌ వాసి..

-

మనుషులంతా ఒకలే కనిపిస్తారు కానీ.. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. అంతెందుకు చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగిన వాళ్లే ఒకలా ఆలోచించరు.. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. కోరికలు తీర్చుకోవడానికి కొంతమంది ఎంత డబ్బు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడరు. దాని వల్ల వాళ్లు సంతోషంగానే ఉంటారు కానీ.. ఇతరులకే కామెడీగా అనిపిస్తుంది. జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి అచ్చం తోడేలుగా కనిపించేందుకు డ్రెస్ కుట్టించుకున్నాడు. ఇందుకోసం మనోడు ఏకంగా రూ. 18 లక్షలు ఖర్చు చేశాడు.

డ్రస్‌ కోసం.. లక్షల్లో ఖర్చు..

జపాన్‌కు చెందిన జోకె జెప్పెట్ అనే సంస్థ జంతువుల్లా కనిపించే దుస్తులను తయారు చేయడంలో ఫేమస్.. చాలామంది.. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ సంస్ధ నుంచి దుస్తులు కుట్టించుకుంటారు. పోయిన ఏడాది ఓ వ్యక్తి అచ్చం కుక్కలా కనిపించే దుస్తులు తీసుకున్నాడు. ఇందుకోసం తను రూ. 12 లక్షలు ఖర్చు చేశాడు. తాజాగా మరో వ్యక్తి తోడేలులా కనిపించే దుస్తులు తయారు చేయించుకున్నాడు. ఇందుకోసం తను ఏకంగా 3,000,000 యెన్లు అంటే..భారత కరెన్సీలో రూ. 18.5 లక్షలు వెచ్చించాడు.

చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తికి జంతువులపై చాలా ప్రేమ ఉండేదట.. టీవీలో కొన్ని అచ్చం జంతువుల్లా కనిపించే సూట్‌లను చూసి.. తోడేళ్ల ఫోటోలను పరిశీలించి.. ఆఖరికి ఓ ఫోటోను ఫిక్స్‌ అయ్యాడట..జెప్పెట్ వారికి ఆ ఫోటో పంపించి…తోడేలు వెనక కాళ్లపై నడిచేలా ఉండాలని చెప్పి డ్రస్‌ తయారు చేయించాడట…50 రోజుల్లో తోడేళు దుస్తులను తయారు చేశారు. ఆ సూట్ రెడీ అయ్యాక వేసుకుంటే.. నా రూపం నేను చూసుకుని ఆశ్చర్యపోయాయని ఆ వ్యక్తి తెలిపాడు.

గతంలో ఇదే సంస్థ నుంచి ఓ కస్టమర్ కుక్కలా కనిపించే సూట్ తయారు చేయించుకున్నాడు. ఈ దుస్తుల తయారీకి సుమారు రెండు నెలల సమయం పట్టింది. ఇందుకోసం సదరు వ్యక్తి రూ. 12 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్‌ అయింది. ప్రత్యేక సందర్భాల్లో తాను ఈ కుక్క సూట్‌ను వేసుకుంటానని కూడా ఆ వ్యక్తి చెప్పాడు.

జపాన్‌కు చెందిన జోకె జెప్పెట్ సంస్థ జంతువుల సూట్‌లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందినది. ఇప్పటివరకు వందల సంఖ్యలు జంతువుల దుస్తులను తయారు చేసింది. ఆయా దుస్తుల తయారీని బట్టి డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 10 లక్షల రూపాయలకు పైనే తయారీ ఖర్చు అయిన దుస్తులను పదుల సంఖ్యలో తయారు చేసినట్లు జెప్పెట్ వెల్లడించింది. అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో వీళ్లకు..ఇలాంటి అభిరుచులు ఉన్న వ్యక్తులు కూడా ఉంటారని ఆ కంపెనీ గ్రహించింది చూడండి.. అది హైలెట్‌ అసలు..!

Read more RELATED
Recommended to you

Latest news