”పారడైజ్ కాశ్మీర్” కి రైలు..!

-

చాలా మంది దూర ప్రాంతాల నుండి కాశ్మీర్ ని చూడడానికి వెళ్తారు. నిజానికి కాశ్మీర్ ఎంతో అందమైన ప్రదేశం. మంచుతో కప్పబడిన కొండలు అందమైన ప్రకృతి తో కాశ్మీర్ ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఎట్టకేలకి కాశ్మీర్ కి ట్రైన్ రాబోతోంది 2023 చివరికి కాశ్మీర్ కి ట్రైన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ని ఇండియన్ రైల్వేస్ అనౌన్స్ చేసింది.

ఇప్పటికి 90% ఇది పూర్తయింది. అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే కాశ్మీర్ నుండి మిగిలిన ప్రాంతాలకి రైల్వే ని కనెక్ట్ చెయ్యడమే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి కి రైలు మార్గం ఇక త్వరలో రాబోతుందని దాదాపుగా పూర్తయిపోయినట్లు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ట్విట్టర్ వేదిక గా అనౌన్స్ చేసింది.

21 పెద్ద బ్రిడ్జిలు కనెక్షన్ పూర్తయినట్లు 11 చిన్న బ్రిడ్జిలు కూడా పూర్తయినట్లు తెలియజేశారు. అలానే జమ్మూ ప్రాంతం లోని జమ్మూ-ఉదంపూర్-కత్రా మరియు కాశ్మీర్‌ లోని బారాముల్లా-బనిహాల్ రైళ్లు క్రమం తప్పకుండా ట్రావెల్ చేస్తాయట. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నివేదిక ప్రకారం చుస్తే కాశ్మీర్‌కు రైలు కనెక్షన్ 20 సంవత్సరాలకు పైగా ఆలస్యం అయ్యినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news