కొత్తగా పెళ్లయిందా హనీమూన్ కి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే మీరు కచ్చితంగా ఈ ప్రదేశాల గురించి చూడాల్సిందే… వేసవి కాలంలో హనీమూన్ కి వెళ్లాలనుకునే వాళ్ళు ఈ ప్రదేశాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. సరదాగా సమయాన్ని మీ జీవిత భాగస్వామితో గడపచ్చు ఎప్పటికీ మరచిపోలేని హనీమూన్ జరుపుకోవచ్చు ఇక మరి వేసవి కాలంలో బెస్ట్ హనీమూన్ డెస్టినేషన్స్ గురించి చూసేద్దాం.. మంచి అందమైన దేశాల వివరాలు సేకరించి మేము మీకోసం పొందపరచాము మరి ఇప్పుడే చూసేయండి..
గ్రీస్ హనీమూన్ కి వెళ్లడానికి చాలా బాగుంటుంది ఇక్కడ 6000 వరకు అందమైన దీవులు ఉన్నాయి. క్రిస్టల్ క్లియర్ బీచ్లు మంచి ఎత్తైన పర్వతాలు అందమైన రిసార్ట్స్ ఇక్కడ ఉన్నాయి కొత్తగా పెళ్లయిన వాళ్లు హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడ ఉండే ప్రదేశాలు మ్యూజియంలో తో పాటుగా చూడడానికి అందమైన ప్రదేశాలు కూడా ఉంటాయి సో మీరు గ్రీస్లో హనీమూన్ చేసుకోవచ్చు ఇటలీలో కూడా హనీమూన్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
కొత్తగా పెళ్లయిన వాళ్లు ఇటలీలో కూడా హనీమూన్ జరుపుకోవచ్చు ఐరోపాలోని అద్భుతమైన దేశం ఇది. కొత్తగా పెళ్లయిన వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇటలీని మీరు హనీమూన్ జరుపుకోవడానికి ఫిక్స్ చేసుకోవచ్చు మే నుండి సెప్టెంబర్ వరకు ఇటలీ చూడడానికి చాలా బాగుంటుంది ముంబై నుండి లేదంటే ఢిల్లీ నుండి డైరెక్ట్ గా ఇటలీ వెళ్లొచ్చు.
స్పెయిన్ కూడా చాలా బాగుంటుంది. మంచి బీచ్లు మంచు పర్వతాలు ఆహ్లాదకరమైన రాత్రులు గడపడానికి ఫేమస్ లగ్జరీ హోటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు మంచి వాటిని ఎంపిక చేసి బుక్ చేసుకోవచ్చు. చూడడానికి చక్కటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. మే నుండి జూలై వరకు ఈ ప్రదేశాలు చూడడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
స్విట్జర్లాండ్ కూడా చాలా బాగుంటుంది స్విట్జర్లాండ్ కూడా హనీమూన్ జరుపుకోవడానికి మంచి ప్రదేశం. ట్రెక్కింగ్, మౌంటనింగ్, బైకింగ్ వంటి సాహసాలను కూడా ఇక్కడ చేయొచ్చు జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ ప్రదేశాలని చూడడానికి అనుకూలంగా ఉంటుంది. లండన్ లో కూడా హనీమూన్ జరుపుకోవచ్చు ఇది కూడా చాలా అందమైన ప్రదేశం ఇక్కడికి కూడా చాలామంది హనుమాన్ కి వస్తూ ఉంటారు. పార్క్ బ్రిటిష్ మ్యూజియం వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఈ ప్రదేశాలన్నీ కూడా హనీమూన్ జరుపుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి మరి ఈరోజు మంచి హనీమూన్ స్పాట్ ఏదో ఫిక్స్ అయిపోయి.. ఆనందంగా మీ లైఫ్ పార్టనర్ తో హనీమూన్ కి వెళ్లి వచ్చేయండి.