ఇదేం టాలెంట్‌రా బాబు.. ముక్కు రంధ్రాలతో మూడు లారీ ట్యూబ్‌లకు గాలి నింపేశాడు..!

-

ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ ఉందంటే.. డెకరేషన్‌లో భాగంగా.. బెలూన్స్‌ కడుతుంటాం.. వాటిని మనమే ఊదాలంటే.. రెండు మూడు ఉదేసరికి పని అయిపోతుంది. బుగ్గలు నొప్పులు వచ్చేస్తాయి. కళ్లుతిరిగినట్లు అనిపిస్తుంది కూడా..కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఏకంగా ముక్కుతో లారీ ట్యూబ్‌ సరిపడా గాలి ఊది రికార్డు సాధించాడు. ఇంతకీ అలా ఎందుకు ఊదాడు, ఎవరతను?
తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కరాటే శిక్షకుడు నటరాజ్ జూన్ 22న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరల్డ్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్ కోసం ప్రయత్నించాడు… దీని కోసం తన ముక్కు రంధ్రాలను ఉపయోగించి మూడు లారీ ట్యూబ్‌లకు గాలి ఊది ప్రపంచ రికార్డు సృష్టించాడు. సీరియల్ రికార్డ్ బ్రేకర్ మూడు లారీ ట్యూబ్‌లను 9 నిమిషాల 45 సెకన్లలో ఊది తన 98వ రికార్డును నెలకొల్పాడు. అది వరల్డ్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా గుర్తించబడింది.
ఎల్లంపిళ్లై పట్టణానికి చెందిన ఈ ఫిట్‌నెస్ గురువుకు శ్వాస వ్యాయామాల పై పూర్తి అవగాహన ఉంది. ప్రాణాయామం గురించి అవగాహన కల్పించడానికి, యోగా అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి తాను ప్రపంచ రికార్డును సాధించానని తెలిపారు. అయితే ముక్కుతో మూడు టైర్ ట్యూబ్‌లను పెంచడం అంత సామాన్యమైన విషయం కాదు.. నిపుణుల మార్గదర్శకత్వం లేకుండా ఎవరూ ఇలా ప్రయత్నించవద్దని నటరాజ్‌ తెలిపారు. సరైన ప్రాక్టిస్ లేకండా ఈ స్టంట్ చేయడం ప్రాణాంతకం.
కొన్ని సంవత్సరాల పాటు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల 9 నిమిషాలు, 45 సెకన్లలో మూడు ట్యూబ్ లలో గాలిని నింపగలిగానని నటరాజ్‌ తెలిపాడు. ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులు అధికారులు, పోలీసులు ఇతని టాలెంట్‌ చూసి ఆశ్యర్యపోయారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన టాలెంట్‌ ఉంటుంది. కానీ నటరాజ్‌కు ఉన్న టాలెంట్‌ నిజంగా చాలా అరుదైనదనే చెప్పాలి. ముక్కుతో గాలి నింపడం అంటే చిన్న విషయం కాదు.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version