వాట్ ఎ ఆఫర్..బూస్టర్ డోసు తీసుకుంటే అవి ఫ్రీ..

-

కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఓ వైపు వ్యాక్సిన్ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది.మొదటి రెండు డోస్ లు తీసుకున్న వారికి బూస్టర్ డోసు కూడా వేస్తుంది. దేశంలో కరోనా ఎంత విజృంభిస్తున్నా.. కొంతమంది మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవడానికి అలసత్వం చూపిస్తూనే ఉన్నారు. బూస్టర్ డోసు తీసుకోవడానికి అస్సలు ఆసక్తే చూపడం లేదు. ఈ మేరకు అందరూ బూస్టరో డోసు తీసుకోవాలనే ఉద్దేశంతో చండీఘర్‌లో ఓ వీధి వ్యాపారి ఓ ఆఫర్ ప్రకటించాడు. బూస్ట‌ర్ డోసు తీసుకున్న వారికి రుచిగా ఉండే పూరి చోలేను ఉచితంగా ప్ర‌క‌టించాడు. చోలే బాతురే అంటే పూరీలోకి సెనగలతో చేసిన కర్రీ. బూసర్ట్ డోస్ తీసుకునే వారి సంఖ్యను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు..

 

ఆ ప్రాంతంలోని ఓ వ్యాపారి వినూత్న ఆఫర్‌ను అందిస్తున్నాడు. కరోనా కట్టడికి బూస్టర్ డోసును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అందుకే.. పూరీ చోలేను ఇస్తున్నట్టు ఆయన చెబుతున్నాడు. అయితే టీకా వేయించుకున్న రోజు మాత్రమే ఈ పూరీ చోలేను అందిస్తానని చెప్పాడు. అయితే గత ఏడాదే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దానికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు..వ్యాక్సిన్ తీసుకున్న రోజు మొబైల్ కు వచ్చిన మెసేజ్ ను చూపించాలి.అప్పుడే అతను ఫ్రీగా పూరి చోలేను ఇస్తాడు.

సైకిల్‌పై ఫుడ్ స్టాల్ నడుపుతూ చోలే భాతురేని విక్రయిస్తున్నాడు. తాను గత 15 ఏళ్లుగా ఈ స్టాల్‌ను నడుపుతున్నారు. అయితే గత ఏడాది తన కుమార్తె, మేనకోడలు ఈ ఐడియా ఇచ్చారని రాణా చెప్పారు. అయితే బూస్టర్ డోస్ తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. కోవిడ్ విషయంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికి దేశంలో కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరగడం చూస్తున్నామని, ఇంకా కేసులు పెరగక ముందే జాగ్రత్తపడాలని సంజయ్ అంటున్నారు..వ్యాక్సిన్ ప్రక్రియను మరింత వేగవంతం చెయ్యాలని ఉద్దేశ్యం తో ఇలాంటి ఆఫర్ ను ప్రకటించినట్లు ఆయన అన్నారు.అతడి ఆఫర్ పై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news