విజిల్ వేసి మాట్లాడుకునే విజిల్ విలేజ్.. మనదేశంలోనే ఉందని తెలుసా..

-

మాట్లాడుకోవడానికి భాష కావాలి. మనదేశంలో ఉన్న 130కోట్ల మంది ఒక్క భాషలో మాట్లాడరు. ఒక్కో ప్రాంతానికి వెళుతున్న కొద్దీ ఒక్కో భాష కనిపిస్తుంటుంది. ఆ భాష మాట్లాడే వారి ఆచారాలు, సంప్రదాయాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అందుకే మన దేశానికి పర్యాటకులు రావడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. పార్కులో మాదిరిగా రోజూ కనిపించే చెట్లే కాకుండా అడవిలో తిరుగుతూ రోజూ కొత్తదాన్నేదో కనుక్కున్నంత అందంగా ఉంటుంది మన సంస్కృతి.

ఐతే మనదేశంలో ఎన్నో భాషలున్నాయి. రాజ్యాంగం ద్వారా గుర్తించబడ్డ భాషలు మొత్తం 22ఉన్నాయి. అవే కాకుండా విజిల్ ద్వారా మాట్లాడుకునే మనుషులున్నారని తెలిస్తేనే ఆశ్చర్యం కలుగక మానదు. మీరు చదువుతున్నది నిజమే. విజిల్ వేసుకుని మాట్లాడుకునే మనుషులు మనదేశంలోనే ఉన్నారు. మేఘాలయలోని ఖాంగ్ తాంగ్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ తరచుగా విజిల్ వేసుకుంటూనే మాట్లాడుకుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని అక్కడి ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ మేరకు భారతదేశం నుండి యునెస్కోకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్ పుత్ ని కలుసుకుని వివరాలు అందజేసారు. తూర్పు కాశీ కొండ జిల్లాల్లో ఉన్న ఈ గ్రామాన్ని యునెస్కో వారాసత్వ సంపదగా గుర్తించాలని డిమాండ్ పెరుగుతుంది. అక్కడి ఎంపీ రాకేష్ సిన్హా, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని రోడ్లు, పరిశుభ్రత వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇంకా, గ్రామస్థులందరికీ కావాల్సిన అన్ని వసతులు అందించడంతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు చేయాల్సిన కృషి చేస్తానని పార్లమెంట్ మెంబర్ హామీ ఇచ్చారు. ఈ విజిల్ విలేజ్ చూడాలని మీకూ ఉందా? ఐతే ఇంకే, మేఘాలయా వెళ్ళండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news