కాలేజీ ప్రేమలు ఎక్కువ కాలం నిలబడకపోవడానికి కారణాలు..

-

కాలేజీ వయసు వచ్చిందంటే చాలు అన్నీ తెలిసిపోయాయనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అప్పటి వరకూ ప్రతీ విషయంలో తల్లిదండ్రుల సలహాలు తీసుకునే వాళ్ళు అప్పటి నుండి అడగటం మానేస్తారు. చాలా విషయాల్లో ఎదుటివాళ్ళు చెప్పేది వినకుండా తమకు నచ్చిందే చేస్తుంటారు. ఇంకా, చెప్పేవారికి ఏమీ తెలియదన్నట్టుగా దానికి వాల్యూ కూడా ఇవ్వరు. అదే టైమ్ లో ప్రేమ అనే పురుగు రోజు కుడుతుంటుంది. అది ప్రేమో కాదో తెలియకపోయినా ప్రేమ మైకంలో పడిపోవాలని తపిస్తుంటారు.

ఐతే చాలా వరకు కాలేజీ ప్రేమలు పెళ్ళి దాకా చేరవు. మీ తరగతిలో చాలా ప్రేమ జంటలు ఉండుంటాయి. కానీ అవన్నీ పెళ్ళి వరకూ వెళ్ళాయా అని ఆలోచించుకుంటే సందేహమే. మరి కాలేజీ ప్రేమలు మధ్యలోనే మాయమైపోవడానికి కారణాలేంటో ఇక్కడ చూద్దాం.

అవతలి వాళ్ళు తమకి తగినట్టుగా మారాలని కోరుకోవడం కాలేజీ ప్రేమల్లో ఎక్కువగా ఉంటుంది. నిజానికి ప్రేమించిన కొత్తలో అలా మారుతుంటారు కూడా. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మారడం అనేది కుదరకుండా పోతుంది.

అంచనాలు:

కాలేజీ ప్రేమలోనే కాదు, చాలా వరకు ప్రేమలు పెళ్ళిదాకా నిలబడకపోవడానికి కారణం అంచనాలే. తాము ప్రేమించిన వారి మీద ఏవేవో అంచనాలు పెట్టేసుకుంటారు. సినిమాల్లో మాదిరి హీరోలా, హీరోయిన్ లా ఉండాలని అనుకుంటారు.

ప్రైవసీ లేకపోవడం

ప్రేమించిన కొత్తలో ఫేస్ బుక్, మెయిల్ పాస్ వర్డుతో సహా అన్నీ చెప్పేస్తారు. కొన్ని రోజులకి తమకంటూ స్పేస్ లేదని గుర్తిస్తారు.

అనుమానం

లేత ప్రేమల్లో అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. అవి కొంత వరకు బాగానే ఉన్నా, పెళ్ళి దాకా వెళ్ళకపోవడానికి అవే కారణాలుగా నిలుస్తాయి.

బంధం వద్దనుకోవడం

వాళ్ళు వీళ్ళు ప్రేమిస్తున్నారనే తప్ప నిజంగా ప్రేమించకపోవడం.

Read more RELATED
Recommended to you

Latest news