వయాగ్రాను బ్యాన్‌ చేయడంతో పాకిస్తాన్‌లో ఉడుము నూనెకు భారీగా పెరిగిన డిమాండ్‌..!

-

పాకిస్తాన్‌ ప్రభుత్వం వయాగ్రాను బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే.. మీ అందరికీ వయాగ్రా ఎందుకు వాడతారో కూడా తెలుసు.. అలాంటిది ఆ ప్రభుత్వం ఆ వయాగ్రాను బ్యాన్‌ చేయడంతో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం వెతుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఉడుము కొవ్వుతో చేసిన ఆయిల్‌కు భారీగా డిమాండ్‌ పెరిగింది. ఉడుము కొవ్వుతో చేసిన నూనెను ఉపయోగించడం వల్ల లైంగిక పనితీరు పెరుగుతుందని పాకిస్తాన్‌ ప్రజలు బలంగా నమ్ముతున్నారు.

పాకిస్తాన్‌ యువత లైంగిక ఆనందాన్ని పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఉడుము కొవ్వుతో చేసిన నూనెను ఉపయోగించడం వల్ల లైంగిక పనితీరు పెరుగుతుందని బలంగా నమ్ముతారు. అందుకే ఉడుములు వేట ప్రాంతాలకు వారంతా క్యూ కడుతున్నారు. పాకిస్థాన్‌లోని రావల్పిండి యువత ఈ ఉడుమ్ ఆయిల్ కోసం ఎగడబడుతున్నారట.. ఎంత ఖర్చయినా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఉడుము నుంచి సేకరించిన కొవ్వును స్కార్పియన్ ఆయిల్‌లో మెరినేట్ చేసి ఎరుపు సుగంధ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. లేదా దానితో సాండ నూనె తయారు చేస్తారు. వీటిని వాడితే శృంగార కోరికలు, పడకగదిలో ఉద్రేకపడే సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని అక్కడ గట్టిగా ప్రచారం జరుగుతుంది.. దీంతో రావల్పిండిలోని రాజా బజార్‌లో ఉడుమ్ ఆయిల్ కోసం యువకులు ఘర్షణకు సైతం దిగారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో ప్రజలు చాలా కాలం పాటు ఉడుము వేటపైనే ఆధారపడి ఉన్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారికి కాలం కలిసివచ్చినట్లు అయింది.. ఉడుములను చంపడం తమకు బాధాకరమని, అయితే జీవనోపాధికి వేరే మార్గం లేదని వారు అంటున్నారు.

ఎక్కువ పిల్లలు ఉంటే గౌరవం..

పాకిస్థాన్‌లో ఎక్కువమంది పిల్లల్ని కనే జంటను సమాజంలోని చాలా మంది కంటే ఎక్కువగా గౌరవిస్తారు. దీంతో చాలా మంది వ్యక్తులు లైంగిక పనితీరును మెరుగుపరచడానికి వయాగ్రాను ఉపయోగిస్తారు. ఎందుకంటే వారికి పిల్లలు లేకపోతే అక్కడ అవమానంగా భావిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం నిషేధించడంతో ఉడుము నూనెకు డిమాండ్ పెరిగింది. కానీ ఇది శృంగార కోరిక, సామర్థ్యం శక్తిని పెంచుతుందని ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news