చెప్పులు, చపాతీ కర్రతో పెయింటింగ్‌ వేసిన మహిళ.. రిజల్ట్‌ చూస్తే వర్త్‌ వర్మ వర్తూ అనాల్సిందే

-

కాదేది కళకు అనర్హం అంటారు. నిజంగా ఈ మాటలో చాలా అర్థం ఉందండోయ్.. మనలో టాలెంట్‌ ఉంటే.. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఊపిరి సినిమాలో హీరో ఒక సీన్‌లో పిచ్చి పిచ్చి గీతలో పెయింట్‌ వేస్తాడు. దాన్ని ప్రకాష్‌ రాజు డబ్బులిచ్చి మరీ కొంటాడు గుర్తుందా..? మీరు ఈ వీడియో చూస్తే.. ముందు మీకు కూడా ఇదేదో పిచ్చి గీతలు గీస్తుంది అనుకుంటారు. అసలు చెప్పులు, చపాతీ కర్ర, చీపురు, మాబ్‌ స్టిక్‌ ఇలా ఏది పడితే దాంతో ఏదేదో చేస్తుంది.. కానీ చివరకు పెయింటింగ్‌ వస్తుందిరా చారీ..! మైండ్‌ బ్లోయింగ్‌ అంతే..! వర్త్‌ వర్మా వర్త్ అనాల్సిందే..!

సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతుంది. అందులో ఒక మహిళ గోడను కాన్వాస్‌గా చేసి అక్కడ పెయింటింగ్ చేయడం ప్రారంభించినట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దీనికోసం మహిళ ఎలాంటి పెయింట్ బ్రష్‌ను ఉపయోగించలేదు. అలా కాకుండా, తన కళాత్మకతను చూపించడానికి, ఆమె రోలింగ్ పిన్ నుంచి చెప్పుల వరకు అన్నిటినీ ఉపయోగిస్తుంది. చివరకు సింహం ముఖాన్ని తయారు చేస్తుంది. అలెక్స్ తన కళకు సైకిల్ ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టింది.

తన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ రకమైన కళ కూడా ఉందని చాలా మంది నమ్మలేకపోతున్నామని కమెంట్‌ చేశారు. ఈ కళాకారుడి పేరు అలెక్స్. తన సారూప్య కళాత్మకతతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆర్ట్‌వర్క్ రీల్ ప్రపంచంలోనే కాకుండా వాస్తవ ప్రపంచంలో కూడా చాలా ఇష్టం. ప్రస్తుతం చర్చనీయాంశమైన పెయింటింగ్ ఆమెది. అందుకోసం అలెక్స్ ఇంట్లోని వస్తువులను ఉపయోగిస్తుంది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. చూసిన తర్వాత ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘ఒక కళాకారుడు ఇలా కళను ప్రదర్శించగలడని నేను నమ్మలేకపోతున్నాను’ అని రాశారు. ‘మీలో ప్రతిభ ఉంటే ఎవరినైనా మెప్పించవచ్చు’ అని మరో నెటిజన్‌ రాశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version