ఇంటి దగ్గరే ఉండి చేసే వ్యాపారం.. నెలకు రూ. 2లక్షల వరకూ ఆదాయం..!!

-

ఈ రోజుల్లో ఏ ఉద్యాగాన్ని నమ్మలేకుండా అయిపోయింది.. ఒకప్పుడు చిన్న చిన్న సంస్థలే ఆర్థిక పరిస్థితి బాలేకపోతే..తీసేస్తాయి అనుకునేవాళ్లం..కానీ ఇప్పుడు గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను ఇంటిబాట పట్టించేస్తున్నాయి.. ఇలాంటి టైమ్‌లో ఉద్యోగం కంటే ఏదైనా వ్యాపారం చేయడం మంచిదిరా సామీ.. అనే ఆలోచన చాలా మందిలో ఉంది. వ్యాపారం చేయాలంటే..పెట్టుబడి లక్షల్లో ఉండక్కర్లేదు.. మన దగ్గర ఉన్న డబ్బుతోనే ఏదో ఒకటి చిన్నది మొదలేసుకోవచ్చు.. అలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.!
మన చుట్టూ ఉండేవారిలో మంచి భోజన ప్రియులను దృష్టిలో పెట్టుకుంటే మన వ్యాపారం చేయడానికి చాలా ఐడియాలు వస్తాయి.. ఏ వ్యాపారంలో అయినా లాస్‌ వచ్చే అవకాశం ఉంటుందేమో కానీ..ఫుడ్‌ బిజినెస్‌లో రాదు.. టేస్ట్‌, క్వాలిటీ మెయింటేన్‌ చేస్తే.. ఎక్కడనుంచి అయినా మీ షాప్‌కు వచ్చేస్తారు. నామ్‌కీన్, స్నాక్స్, హోం ఫుడ్స్.. మన దేశంలో టీ తర్వాత రెండో బిజినెస్ ఇదే అని చెప్పవచ్చు. ఇవి అన్ని తరగతుల వారికి ఇష్టమైనవి.. నమ్కీన్, ఖారా వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు భారీ లాభాలను పొందవచ్చు. మీరు దీన్ని చిన్న లేదా పెద్ద స్థాయిలో ప్రారంభించవచ్చు. మీరు మీ ఖర్చుకు అనుగుణంగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.

ఏం కావాలి..?

దేశంలోని ప్రతి ఇంట్లో ఉదయం అల్పాహారం నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు నమ్కీన్, ఖరా ఇలాంటివి తినేందుకు మనం చాలా ఇష్టపడుతాం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు 300 నుంచి 500 చదరపు అడుగుల స్థలం అయితే కావాలి… దీని కోసం, మీరు మీ ఇంటిలోని ఏదైనా భాగాన్ని వాడుకోవచ్చు.. దీనితో పాటు, మీరు FSSAI రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి.
ఇంకా మీకు ఓ ప్యాకింగ్ మెషీన్, ముడిసరుకులు ఉంటే చాలు వెంటనే వ్యాపారం స్టాట్‌ చేయొచ్చు. ముడి పదార్థాలలో మీకు నూనె, పప్పులు, బంగాళదుంపలు, శనగపిండి, వేరుశెనగ, కొన్ని మసాలాలు(ధనియా పొడి) అవసరం అవుతాయి. దీన్ని ఉపయోగించి మీరు మంచి స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత బిజినెస్ పెరిగిన కొద్ది కొన్ని ఆధునిక యంత్రాలను తెచ్చుకుంటే సరిపోతుంది.

పెట్టుబడి ఎంత కావాలి..?

ఈ వ్యాపారంలో మీ ఖర్చు కనీసం రూ. 2 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. ఈ వ్యాపారంలో మీరు ప్రారంభంలోనే 20 నుండి 30 శాతం లాభం పొందుతారు. అంటే మీరు నెలలో రూ. 2 లక్షల 40 వేల రూపాయలు సంపాదిస్తారు..అయితే వ్యాపారం తొలినాళ్లలో మీరు కష్టపడాల్సి ఉంటుంది. మీ ఫుడ్‌ టేస్ట్‌ అందరికి నచ్చేలా ఉండాలి.. కష్టమైజ్‌డ్‌గా కూడా చేసే వెసులుబాటు పెట్టుకుంటే..మన కష్టమర్స్‌ను బాగా యాట్రాక్ట్‌ చేసుకోవచ్చు.. అంత పెట్టుబడి ఉండి చేయగలం అనే ధైర్యం ఉంటే..నిపుణులును కూడా సంప్రదించి స్టాట్‌ చేయొచ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news