వ్యక్తిత్వ పరంగా మనుషులు రెండు రకాలుగా విభజించబడ్డారు. వీరిని ఇంట్రెస్టింగ్ పీపుల్ మరియు బోరింగ్ పీపుల్ అంటారు. ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు మధ్య మనకు పలు అంశాల్లో అనేక వైరుధ్యాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
ఇంట్రెస్టింగ్ పీపుల్ విషయానికి వస్తే
1. వీళ్ళు ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే దాని గురించి ఆసక్తి చూపించడమే కాకుండా మాట్లాడానికి భయపడరు.
2. వీళ్లకు రకరకాల హాబీలు ఉంటాయి. తమ సమయాన్ని వృథా చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు.
3. ఆసక్తికరమైన నూతన విషయాలను తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తూనే ఉంటారు.
4. ఏదైనా సాధించాలి అని సంకల్పించారో దాన్ని సాధించేదాకా నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు.
బోరింగ్ పీపుల్
1. వీరు పనిని శ్రద్ధగా చేసేందుకు ఏమాత్రం ఆసక్తి చూపారు.
2. ప్రతి విషయంలో కంఫర్ట్ ను కోరుకుంటూనే ఉంటారు.
3. వీళ్లకు కొత్త విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపరు.
4. సర్దుకుని పోయేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
5. వీరు జీవితంలో విజయం సాధించడానికి తమ మీద కంటే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడతారు.